Hyper Aadi: బంపరాఫర్ కొట్టేసిన హైపర్ ఆది.. త్వరలో ఎమ్మెల్సీగా జబర్ధస్త్ కమెడియన్..?
Hyper Aadi: జబర్ధస్త్ షో చూసేవాళ్లకు హైపర్ ఆది గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోతో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు పట్టేసాడు. ఈయన స్వతహాగా మెగాభిమాని. అంతేకాదు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ వీర భక్తుడైన హైపర్ ఆదికి త్వరలో ఎమ్మెల్సీ పదవిని కానుకగా ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Hyper Aadi: జబర్దస్త్ కామెడీ షో వల్ల ఎంతో మంది కమెడియన్స్ కెరీర్ మారిపోయింది. ఎంతో మంది జబర్ధస్త్ కమెడియన్స్ కు ఈ షో లైప్ ఇచ్చింది. అందులో హైపర్ ఆది ఒకరు. ఈ షోలో ఎంతో మంది కమెడియన్స్ ఉన్న హైపర్ ఆది వేసే పంచుల కోసమే ఈ షో చూసేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ షోతో హైపర్ ఆది జీవితంలో బాగానే సెటిలయ్యాడు. అంతేకాదు ఈ షో ద్వారా వీలైనపుడల్లా మెగా హీరోలపై తన అభిమానాన్ని చాటుకుంటునే ఉండేవాడు. అదే ఈయన్ని మెగాభిమానులకు దగ్గర చేసింది. అంతేకాదు వైసీపీ నేతలు జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేసే కారు కూతలకు కూడా ఈయన గట్టి సమాధానంతో పాటు కౌంటర్ ఇచ్చే వాడు. ఇదే అతన్ని పవన్ కళ్యాణ్ కు దగ్గర చేసింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్.. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ నేపథ్యంలో తన కోసం తన పార్టీ జనసేన కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా కష్టపడ్డ హైపర్ ఆది మంచి పదవితో గౌరవించాలనుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వంలో త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి హైపర్ ఆదికి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ రకంగా తనను నమ్ముకుంటే భవిష్యత్తులో మంచి పదవులు వస్తాయనే సంకేతం ఇచ్చినట్టు అవుతుందనే ఉద్దేశ్యంతో హైపర్ ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు జనసేన పార్టీ విషయానికొస్తే.. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పొత్తుతో పోటీ చేసారు. అంతేకాదు కంటెస్ట్ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా ఏపీలో గుర్తింపు తెచ్చుకుంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముందుగా హైపర్ ఆది సహా పార్టీ కోసం పనిచేసిన సినిమా వాళ్లను తగిన గౌరవం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి