Hyper Aadi Saddam Issue హైపర్ ఆది, సద్దాంలు బుల్లితెరపై పోటాపోటీగా స్కిట్లలో రచ్చ చేస్తుంటారు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆది జబర్దస్త్ షోలో ఉండగా.. సద్దాం అదిరింది, బొమ్మ అదిరింది, కామెడీ స్టార్స్ వంటి షోలు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఓ పాయింట్ దగ్గర ఈ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. యూట్యూబ్‌లో తనకే ఎక్కువగా ఫాలోయింగ్ ఉందని, తన స్కిట్లే వైరల్ అవుతుంటాయని సద్దాం అన్నట్టుగా ఉన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనవి ఎన్నో స్కిట్లు మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టేశాయని సద్దాంను తక్కువ చేసినట్టుగా ఆది మాట్లాడాడు. అలా ఈ ఇద్దరి మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరు జరుగుతూనే ఉండేది. అయితే ఇప్పుడు సద్దాం మళ్లీ మల్లెమాల టీంలోకి వచ్చాడు. ముందు పటాస్ షోతోనే సద్దాం ఫేమస్ అయ్యాడు.


 



పటాస్ షో మధ్యలో అయిపోయాక.. సద్దాం బయటకు వచ్చాడు. ఆ తరువాత నాగబాబు గ్యాంగ్‌తో కలిసి కొన్ని ప్రోగ్రాంలు చేశాడు. ఇక చివరకు స్టార్ మాలో సద్దాం ఫిక్స్ అయ్యాడు. మళ్లీ ఏమైందో ఏమో గానీ సద్దాం తన గ్యాంగ్‌ను తీసుకుని మల్లెమాలకు వచ్చాడు. మల్లెమాల తన ఇంటి వంటిదని చెబుతూ స్కిట్లు చేస్తున్నాడు.


ఇక ఇప్పుడు ఆది, సద్దాంలు కలిసి ఒకే స్టేజ్ మీద కనిపించారు. వేర్ ఈజ్ ది పార్టీ అంటూ న్యూ ఇయర్ ఈవెంట్‌ చేస్తున్నారు. దాంట్లో ఆది అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. సద్దాంకి, తనకు గ్యాప్ వచ్చిందని, ఓ చిన్న విషయంలో మనస్పర్థలు వచ్చాయని, అది ఈ ఏడాదిలో పూర్తిగా సమసిపోవాలని కోరుకుంటున్నాను అంటూ సద్దాంను ఆది దగ్గరకు తీసుకున్నాడు.


Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్


Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి