Hyper Aadi Satires on Anchor Rashmi బుల్లితెరపై హైపర్ ఆది, యాంకర్ రష్మీ, సుధీర్ వంటి వారికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా రష్మీ సుధీర్ ట్రాక్ బుల్లితెరపై అలా సాగుతూనే వస్తోంది. తామిద్దరం మంచి స్నేహితులమేనని, అంతకు మించి ఏమీ లేదని, తాము తెరపై ఏం చేసినా కూడా అది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమేనని రష్మీ, సుధీర్ ఎంతో క్లారిటీగా చెబుతుంటారు. అయినా కూడా వారి అభిమానులు మాత్రం అదేమీ పట్టించుకోరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్మీ సుధీర్ రియల్ లైఫ్‌లో ఒక్కటవ్వాలని కోరుకుంటారు. పెళ్లి చేసుకోండని సలహాలు ఇస్తుంటారు. అలా రష్మీ సుధీర్ ట్రాక్ బుల్లితెరపై ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌లానే ఉంటుంది. రష్మీ సుధీర్ కలిసి ఎన్నో షోలు చేశారు. ఈవెంట్లలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు సుధీర్ తన సినిమాలతో బిజీగా ఉండటంతో.. బుల్లితెరకు దూరమయ్యాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోల నుంచి సుధీర్ తప్పుకున్నాడు.


 



సుధీర్ స్థానంలో శ్రీదేవీ డ్రామా కంపెనీ యాంకర్‌గా రష్మీ వచ్చింది. బాబు అంటూ రష్మీని సుధీర్ పేరు పరోక్షంగా తీస్తూ ఏడిపిస్తుంటాడు హైపర్ ఆది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది రెచ్చిపోయాడు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ ఆదివారం శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్‌ను నడిపించబోతోన్నారు. వాలెంటైన్స్ డేకి ఒకరికి గట్టిగా ఇవ్వాలని అనుకుంటున్నాను రష్మీ అంటుంది.


నాకు ఇవ్వు.. నేను వెళ్లి ఇస్తాను అని ఆది కౌంటర్ వేస్తాడు. బాబుకి ఏమైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేశావా? అని ఆది సెటైర్ వేస్తాడు. మీరు సర్ ప్రైజ్ ఇస్తే ఇవ్వండి గానీ.. బాబుని ఎత్తుకుని మాకు మాత్రం సర్ ప్రైజ్ ఇవ్వరు కదా? అని రష్మీ సుధీర్ జోడి మీద పరోక్షంగా కౌంటర్లు వేస్తాడు ఆది. ఇక చివర్లో రష్మీ సుధీర్ పేర్ల మీద ఫ్లేమ్స్ చేయబోతాడు ఆది. కానీ ఆ పేపర్‌ను చించి ముక్కలు చేస్తుంది రష్మీ. అలా రష్మీ విషయంలో ఆది ఎప్పుడూ కాస్త హద్దులు దాటుతున్నట్టుగానే అనిపిస్తుంది.


Also Read:  Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు


Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook