Hyper Aadi JabarDasth Promo : జబర్దస్త్ షోలో ఆది వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.ట్రెండింగ్ టాపిక్‌ల మీద ఎక్కువగా పంచ్‌లు వేస్తుంటాడు. పైగా జబర్దస్త్ సర్కిల్స్‌లో జరిగే వాటి మీదే కౌంటర్లు వేస్తుంటాడు. మధ్యలో ఆది కూడా జబర్దస్త్ షో నుంచి దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ షోలంటూ బిజీగా తిరిగాడు. ఆ టైంలో జబర్దస్త్ షో మరింత దారుణంగా పడిపోయింది. యాంకర్‌గా అనసూయ కూడా బయటకు వచ్చింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ కూడా వెళ్లిపోయాడు. చివరకు సుధీర్ మల్లెమాల నుంచి దూరంగా ఉన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అనసూయ, సుధీర్ ఇద్దరూ కలిసి స్టార్ మా చానెల్లో సింగింగ్ షోను హోస్ట్ చేశారు. అలా మల్లెమాల నుంచి సుధీర్, అనసూయ దూరమైపోయారు. రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చారనే కారణంతోనే వెళ్లినట్టున్నారని సుధీర్ గురించి ఆది అనేశాడు. అయితే ఇప్పుడు సుధీర్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో సుధీర్ కమ్ బ్యాక్ అదిరిపోయింది.


 



ఇక త్వరలోనే మళ్లీ ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలోకి కూడా వచ్చేస్తాడు. అయితే తాజాగా ఇలా రీ ఎంట్రీ ఇస్తుండటంపై ఆది కౌంటర్లు వేశాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది అదరగొట్టేశాడు. తన టీం మేట్ పరదేశీతో కలిసి ఆది స్కిట్లో అందరి మీద కౌంటర్లు వేశాడు. 


ఇక్కడ చాలా మంది ఫేమ్ సంపాదించుకుని, పక్క రాజ్యానికి వెళ్తున్నారు ఎందుకు అని పరదేశీ అడుగుతాడు. అక్కడ ఏదో ఉందని వెళ్తున్నారు అని ఆది అంటారు. మళ్లీ ఇక్కడకు రావాలని ఎందుకు అడుగుతున్నారు.. అని పరదేశీ ప్రశ్నిస్తాడు. అక్కడ ఏం లేదని తెలుసుకుని అంటూ ఆది కౌంటర్లు వేస్తాడు. అంటే త్వరలోనే అనసూయ కూడా మళ్లీ మల్లెమాలకు తిరిగి వస్తుందా? అన్నది చూడాలి. అయితే సుధీర్, అనసూయల మీద కౌంటర్లు వేసినట్టుగా అనిపిస్తోంది.


Also Read : Bigg Boss 10th week Elimination : డేంజర్‌ జోన్‌లో శ్రీసత్య, శ్రీహాన్‌, ఫైమా.. వేడుకున్న గలాట గీతూ


Also Read : siddhant suryavanshi Death : వర్కౌట్లు చేస్తూ జిమ్‌లో కుప్పకూలిన సిద్దాంత్.. హార్ట్ ఎటాక్‌తో యంగ్ నటుడు మృతి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook