Kiara Advani about Life and relationship: బాలీవుడ్‌ స్టార్లు వరుణ్‌ ధావన్‌, కియారా అడ్వాణీ జంటగా నటించిన సినిమా 'జుగ్‌ జుగ్‌ జియో'. రాజ్‌ మెహ్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనిల్‌ కపూర్ , నీతూ కపూర్‌ కీలకపాత్రలు పోషించారు. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచుకుంది. వరుణ్‌-కియారా పెయిర్‌ బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్‌-కియారా ఇటీవల సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా రిలేషన్‌షిప్‌పై స్పందించారు. రిలేషన్‌షిప్‌లో సారీ చెప్పడానికి తనకేం ఇబ్బందిలేదన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలేషన్‌లో ఉన్నప్పుడు గొడవలు జరిగితే.. ముందు అమ్మాయి సారీ చెప్పాలా లేదా అబ్బాయి చెప్పాలా? అని కియారా అడ్వాణీని ఓ విలేకరి అడగ్గా.. 'ఏ బంధంలోనైనా గొడవలు రావడం చాలా సహజం. గొడవలు ఎప్పుడు జరిగినా.. ముందు తామే భార్యకు సారీ చెబుతామని పెళ్లైన పురుషులు చెప్పడం విన్నా. నా ఉద్దేశం ప్రకారం గొడవలు ఎవరి వల్ల జరిగినా.. సారీ చెప్పుకోవడం ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది. పెళ్లి తర్వాత వచ్చే గొడవల గురించి నేను మాట్లాడను కానీ.. ఏ రిలేషన్‌లోనైనా గొడవలు జరిగినప్పుడు ఇద్దరూ సారీలు చెప్పుకోవడంలో తప్పులేదు' అని అన్నారు. 


'నాకు గొడవలు పెద్దగా ఇష్టం ఉండదు. నాకు ఎప్పుడూ సమస్యలు ఎదురుకాలేదు. ఒకవేళ గొడవ పడితే.. దానికి అంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టి బంధాన్ని ముందుకు కొనసాగించాలనుకుంటా. అందుకు సారీ చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదు. నాకు ప్రేమ ముఖ్యం. దానికోసం కొంచెం తగ్గినా పర్వాలేదు' అని కియారా అడ్వాణీ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా డేటింగ్ చేస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 


కియారా అడ్వాణీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో కియారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నారు. అనంతరం మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా రూపొందిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించారు. ప్రస్తుతం ‘ఆర్సీ 15’ సినిమాలో నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌ హీరోగా స్టార్ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.


Also Read: 1983 World Cup: భారత క్రికెట్ చరిత్రలోనే.. ఎప్పటికీ మర్చిపోలేని రోజుకు 39 ఏళ్లు!


Also Read: Vikram Rare Feat : కమల్ మాస్.. లెక్కలు మాములుగా లేవుగా.. అరుదైన రికార్డులు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.