Vikram Rare Feat : కమల్ మాస్.. లెక్కలు మాములుగా లేవుగా.. అరుదైన రికార్డులు!

Vikram Rare Feat : కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్గా నిలిచి భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తున్న భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు కొన్ని రేర్ ఫీట్స్ సాధించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2022, 12:26 PM IST
  • భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తున్న విక్రమ్
  • సూపర్ హిట్గా నిలిచిన విక్రమ్
  • రేర్ ఫీట్స్ సాధించిన విక్రమ్
Vikram Rare Feat : కమల్ మాస్.. లెక్కలు మాములుగా లేవుగా.. అరుదైన రికార్డులు!

Vikram Movie Rare Feat : లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తున్న ఈ సినిమా రేర్ ఫీట్స్ సాధించినట్టు తెలుస్తోంది. జూన్ 3న విడుదలైన విక్రమ్ సినిమా బాక్సాఫీసు కొల్లగొడుతోంది. చాలా కాలం తరువాత లోకనాయకుడికి మంచి బ్రేక్ గా ఈ సినిమా నిలిచింది. కమల్ హాసన్‌తో పాటు ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించగా..సూర్య ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించారు.

జూన్ 3న విడుదలైన ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా 200 కోట్ల వరకు సంపాదించిందని తెలుస్తోంది. విక్రమ్ సినిమాను తెలుగులో విక్రమ్ హిట్ లిస్ట్ పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. మంచి వసూళ్లు సాధిస్తూ వచ్చిన ఈ సినిమా తెలుగులో అయితే డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటి దాకా ఏరియాల వారీగా కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం : 6.73 కోట్లు, సీడెడ్ : 2.12 కోట్లు, ఉత్తరాంధ్ర : 2.33 కోట్లు, ఈస్ట్ గోదావరి : 1.22 కోట్లు, వెస్ట్ గోదావరి : 81 కోట్లు, గుంటూరు: 1.10 కోట్లు, కృష్ణా: 1.25 కోట్లు, నెల్లూరు: 55 లక్షలు సాధించింది. 

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్లకు పైగా లాభాలు ఆర్జించింది. అలాగే రిలీజయిన అన్ని ఏరియాలలో 200% రికవరీ సాధించింది. ఈమధ్య కాలంలో స్టార్ హీరో సినిమాకు ఈమేరకు రికవరీ రావడం కూడా ఒక రికార్డు అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేటర్లలో కలెక్షన్లు కాస్త తగ్గిన తరువాత..లేదా 4-5 వారాల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావచ్చని ముందు అంచనా వేశారు. అందుకు తగ్గట్టిగానే ఈ విక్రమ్ సినిమా జులై 8వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కావచ్చని అంటున్నారు. 
Also Read:Prudhvi Raj : నేను ఉగ్రవాదిని.. కొవ్వు, మదం పట్టి మాట్లాడా.. పాత సంగతులు అన్నీ బయటపెట్టిన పృథ్విరాజ్

Also Read:Actor VP Khalid No More: షూటింగ్లో కన్నుమూసిన నటుడు.. టాయిలెట్‌కి వెళ్లి రాకపోవడంతో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News