Ram Charan Honored with Madame Tussauds Wax Statue: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ చిరుత మూవీ తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మగధీరతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా అప్పటివరకు ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఆ తరువాత ఆచితూచి అడుగులు వేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు రామ్ చరణ్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించి,  ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపుని సొంతం చేసుకున్నారు రాంచరణ్. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా గ్లోబల్ స్థాయిలో ఈ పాత్ర ఎంత పాపులర్ అయిందో అంతే పాపులారిటీ రామ్ చరణ్ కి కూడా లభించింది అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు అరుదైన గౌరవం లభించింది. మేడమ్ టుస్సాడ్స్ లో రామ్ చరణ్ కు సంబంధించిన మైనపు విగ్రహం ఏర్పాటు చేసి రామ్ చరణ్ కు అరుదైన గౌరవాన్ని అందించారు. అసలు విషయంలోకి వెళ్తే.. లండన్ లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఈయన పాపులారిటీ ఫాలోయింగ్ గుర్తించిన.. మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని ఐఫా 2024 కార్యక్రమంలో ప్రకటించడం విశేషం.


ఇకపోతే ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ కి వెళ్ళిపోయిన రామ్ చరణ్.. అక్కడ తన విగ్రహ తయారీకి కావలసిన కొలతలను ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న రామ్ చరణ్ విగ్రహానికి ఒక ప్రత్యేకత కూడా ఉండనుందట. అదేమిటంటే రామ్ చరణ్ ఫ్రెంచ్ బార్బేట్ జాతికి చెందిన కుక్కపిల్ల రైమ్ ను ఎప్పుడు తనతో పాటు తీసుకెళ్లడం రామ్ చరణ్ దంపతులకు అలవాటు.ఇప్పుడు కూడా రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ ను రామ్ చరణ్ ఎత్తుకొని ఉన్నటువంటి విగ్రహాన్ని తయారుచేసి.. అక్కడ ఉంచబోతున్నారట. ఏది ఏమైనా రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ డాగ్ కి కూడా ఈ గౌరవం లభించడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.


Read more: Hydra Victims: నీ అయ్య జాగీరా ఎవడ్రా నువ్వు మా ఇల్లు కూలగొట్టేది.. హైడ్రా వర్సెస్ మూసీ బాధితులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.