Ilaiyaraaja Biopic First look Poster: వెండితెరపై ఇళయ రాజా బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. ధనుశ్ ఇసై జ్ఞానీ పాత్రలో నటిస్తున్నారు. ఈ బయోపిక్ గురించి ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. ఇపుడు అది కార్యరూపం దాల్చింది. తాజాగా ఇళయరాజాకు చెన్నైలో ఓ హార్మోనియం పట్టుకొని అక్కడి వీధుల్లో వచ్చిన ఓ పోస్టర్‌ను విడుదల చేసారు. ఇందులో అప్పటి చెన్న పట్నం ఎలా ఉందో ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఇళయరాజా ఎలా సంగీత సామ్రాట్‌గా ఎదిగిన విధానం.. అందుకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాను ధనుశ్‌తో రీసెంట్‌గా 'కెప్టెన్ మిల్లర్' మూవీని తెరకెక్కించిన అరుణ్ మాతేశ్వరన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను కనెక్ట్ మీడియా, PK ప్రైమ్ ప్రొడక్షన్, మరియు మెర్క్యూరీ మూవీస్ బ్యానర్ పై శ్రీరామ్ భక్తిశరణ్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, ఇళంపర్తి గజేంద్రన్ నిర్మిస్తున్నారు. మరి ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేస్తారా అనేది చూడాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇళయరాజా విషయానికొస్తే..
తమిళుడైన తెలుగు వారికీ ఆయనతో మంచి అనుబంధమే ఉంది. తెలుగు వారు కాకపోయినా.. తన సంగీతంతో ఎనలేని గౌరవం కల్పించిన మహానుభావుడు. సంగీతానికి హద్దులు లేవనే విషయాన్ని తన మ్యూజిక్‌తో ప్రూవ్ చేసాడు. మరణ మృదంగాలతో సైతం రుద్రవీణలు వాయించిన ఘనుడు ఇళయరాజా. ఈయన 1943 జూన్ 2న తమిళనాడులోని తేని జిల్లా, పన్నైపురమ్ గ్రామంలో రామస్వామి, చిన్నతాయిమ్మాల్ దంపతులకు మూడు కుమారుడిగా జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు జ్ఞానదేశికన్ పేరు పెట్టారు.  సినిమాల్లో వచ్చిన తర్వాత ఇళయరాజాగా పేరు మార్చుకున్నారు. 1968లో మద్రాసులో ధన్ రాజ్ పిళ్లై వద్ద సంగీతంలో టిప్స్ నేర్చుకొన్నాడు. శాస్త్రీయ సంగీతంతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్ పై పట్టు సాధించారు.




ఇళయరాజకు ఫస్ట్ టైమ్ ట్యూన్ చేసింది సినిమాకు కాదు.   కన్నదాసన్ అనే తమిళ కవి రాసిన పాటకు..మన దేశపు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూకు నివాళిగా రాసిన పాట. ఈ సాంగ్ ఇళయరాజాకు మంచి పేరు తీసుకొచ్చింది. 1976లో వచ్చిన 'అన్నక్కలి' అనే తమిళ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఈయన పేరు తెరపై కనిపించింది.  అక్కడ నుంచి ఇసై జ్ఞానీ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. తెలుగులో ఫస్ట్ మూవీ సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో వచ్చిన 'భద్రకాళి'. ఆ తర్వాత తెలుగుతో పాటు  దక్షిణాది హిందీ సహా దాదాపు 1000 పైగా చిత్రాలకు సంగీతం అందించిన ఇళయరాజా జీవితంలో ఓ సినిమాకు కావాల్సినంత మసాలా ఉంది. మరి ఆ మూమెంట్స్‌ను వెండితెరపై దర్శకుడు ఎలా ఆవిష్కరిస్తారో చూడాలి. దానికి ధనుశ్ ఎలా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారనేది వెయిట్ అండ్ సీ.


Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్‌.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌


Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook