Singer Revanth Marriage: వివాహబంధంలోకి అడుగుపెట్టిన సింగర్ రేవంత్.. పెళ్లి ఫొటోలు వైరల్
Singer Revanth Marriage: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన గాయకుడు రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. గుంటూరుకు చెందిన అన్వితను ఆదివారం (ఫిబ్రవరి 6)న పెళ్లాడాడు. వీరికి సంబంధించిన పెళ్లి ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Singer Revanth Marriage: టాలీవుడ్ సింగర్ రేవంత్ వివాహబంధంలో అడుగుపెట్టారు. గుంటూరుకు చెందిన అన్వితను ఆదివారం పెళ్లాడారు. కరోనా ఆంక్షల కారణంగా ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది సన్నిహితుల మధ్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్ వేడుకకు వేదికైంది.
ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుంచి పలువురు గాయనీగాయకులు హాజరయ్యారు. రేవంత్ - అన్వితల పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక, రేవంత్-అన్వితల నిశ్చితార్థం డిసెంబర్ 24న జరగ్గా.. ఆ ఫొటోలను రేవంత్ సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఓ తెలుగు టీవీ ఛానల్ నిర్వహించిన సింగింగ్ షో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు సింగర్ రేవంత్. ఆ తర్వాత అనేక ఛానల్స్ నిర్వహించిన సింగింగ్ కాంపిటీషన్లలో రేవంత్ రన్నరప్ గా నిలిచాడు. ఆ క్రమంలో అనేక సినిమాల్లో పాడే అవకాశం లభించింది.
కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ లో జరిగే ఇండియన్ ఐడల్ 9వ సీజన్ విజేతగా నిలిచాడు. 'బాహుబలి' సినిమాలో 'మనోహరి' సాంగ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు సింగర్ రేవంత్. ఇటీవలే 'ఆచార్య' సినిమాలో 'సానా కష్టం' సాంగ్ ను ఆలపించారు.
Also Read: Case on Youtuber Sarayu: బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ, యూట్యూబర్ సరయూపై కేసు నమోదు
ALso Read: Lata Mangeshkar Telugu Songs: లతా మంగేష్కర్ పాడిన 2 తెలుగు పాటలూ సూపర్ హిట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook