Munawar Faruqui: మునవ్వర్ ఫారూఖీ. ఇప్పుడీ పేరు అందరికీ పరిచయమైపోయింది. వివాదాస్పదన స్టాండప్ కమెడియన్ మునవ్వర్ ఫారూఖి షోలకు ఎంత ఛార్జ్ చేస్తాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబై, డోంగ్రిలోని ఓ సాధారణ బాలుడి స్థాయి నుంచి ఏక్తాకపూర్ లాక్‌అప్ షో విన్నర్‌గా ఎదిగిన మునవ్వర్ ఫారూఖి దేశవ్యాప్తంగా ఓ వివాదాస్పద కమెడియన్‌గా ప్రాచుర్యం పొందాడు. ప్రస్తుతం దేశంలో మోస్ట్ పాపులర్ కమెడియన్ ఇతనే. అతని చుట్టూ ఉన్న వివాదాలు మరింత పాపులర్ చేశాయి. 2021 జనవరిలో చేసిన ఓ స్టాండప్ కామెడీ షోలో హిందూవుల మనోభావాల్ని గాయపరిచాడనే కారణంతో..ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఓ నెల జైల్లో ఉన్నాడు. అప్పట్నించి యువతలో మునవ్వర్ ఫారూఖీ పాపులారిటీ పెరిగింది. 2022 లాక్‌అప్ షోలో స్మార్ట్ అండ్ ఫెయిర్ గేమ్ కారణంగా లక్షలాదిమంది హృదయాల్ని గెల్చుకున్నాడు.


ఇటీవల హైదరాబాద్‌లో మునవ్వర్ ఫారూఖీ షో నిర్వహించాడు. ఎన్నో ఆటంకాల మధ్య 2300 మందితో భారీగా షో సక్సెస్ అయింది. ఇంతటి వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునవ్వర్ ఫారూఖీ ఒక్కొక్క షోకు ఎంత ఛార్జ్ చేస్తాడనేది ఆసక్తిగా మారింది.సెలెబ్‌వాలే.కామ్ అందించిన వివరాల ప్రకారం 2022లో మునవ్వర్ ఫారూఖీ నెట్ విలువ 2 కోట్లకు చేరుకుంది. 


ఇంతకుముందు మునవ్వర్ ఫారూఖీ ఒక్కొక్క షోకు 1.5-2.5 లక్షలు రూపాయలు ఛార్జ్ చేసేవాడు. పాపులారిటీ పెరగడంతో ఇప్పుడు ఒక్కొక్క షోకు 3-4 లక్షలు వసూలు చేస్తున్నాడు. హైదరాబాద్ షోకు కూడా ఇదే ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. 


Also read: New Villian in Pushpa the Rule: పుష్ప 2 కోసం సుకుమార్ నయా ప్లాన్.. రంగంలోకి పవర్ ఫుల్ విలన్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook