Amitabh Bachchan in Kalki: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలో విడుదలైంది. అంచనాలకు మించి కలెక్షన్లు అందుకుంటూ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో మిగతా అన్ని పాత్రల కంటే అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వద్ధామ పాత్ర హైలైట్ గా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెండితెర మీద అశ్వద్ధామ పాత్రలో బచ్చన్ నటన అభిమానులకు కనుల విందు వచ్చేసింది. ప్రభాస్ కంటే ఎక్కువ అమితాబ్ బచ్చన్ కే ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉందని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా ఉంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే  అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వద్ధామ పాత్ర ఏంటి? మహాభారతంలో అశ్వద్ధామ పాత్రకి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది. ఎందుకు శ్రీకృష్ణుడు అశ్వద్ధామని శపిస్తాడు? వంటిది తెలుసుకుందాం. 


కౌరవుల తరఫున యుద్ధం చేస్తున్న అశ్వద్ధామ ని పాండవులు చంపేస్తారు. దీంతో పాండవులపై ద్వేషం పెంచుకున్న అశ్వద్ధామ వాళ్లని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. పాండవుల లోని ఆడవాళ్ళ గర్భంలో ఉన్న శిశువులు చనిపోయేలాగా బ్రహ్మస్థాన్ని వదులుతాడు. దీంతో పట్టరాని కోపంతో శ్రీకృష్ణుడు అశ్వద్ధామ అని శపిస్తాడు. కలియుగం పూర్తయ్యేదాకా అశ్వద్ధామ తన గాయాలతో బతికి ఉండమని శపిస్తాడు. 


తాను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదా అని అశ్వద్ధామ అడగగా, కలియుగం పూర్తయ్యే సమయంలో తానే మళ్లీ కల్కి అవతారంలో వస్తానని, తాను గర్భంలో ఉన్నప్పుడు తన తల్లిని కాపాడాలి అని చెబుతాడు. అయితే అశ్వద్ధామ నిజంగానే కల్కి అవతారం కోసం ఎదురుచూస్తున్నాడా? లేక కలియుగం పూర్తయి సమయంలో కలికి సహాయం చేస్తాడా? ఇలా అశ్వద్ధామ పాత్ర ఎలా పూర్తవుతుంది అనే విషయంపై ఎన్నో ఊహాగానాలు కూడా ఉన్నాయి.


మన పురాణాల ప్రకారం ప్రపంచంలో ఉన్న ఏడుగురు చిరంజీవులలో అశ్వద్ధామ కూడా ఒకరు. ధర్మం అదుపు తప్పినప్పుడు, కలియుగం పూర్తయిపోతున్నప్పుడు అశ్వద్ధామ మళ్లీ బయటకు వస్తాడని పురాణాల్లో ఉంది. అయితే నాగ్ అశ్విన్ రాసుకున్నది ఒక ఫిక్షనల్ కథ. కాబట్టి అశ్వద్ధామ పాత్ర ఏం చేస్తుంది అనే విషయంలో నాగ్ అశ్విన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 


ఏదేమైనా నిన్నటిదాకా కల్కి 2898 ఏడి సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులు ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా ఫైనల్ రన్ కూడా పూర్తవలేదు కానీ అప్పుడే సోషల్ మీడియాలో కల్కి ఎలా ఉండబోతోంది అనే విషయంపై కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.


Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..


Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి