Pushpa 2 promotions: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా రికార్డులను ఈ సినిమా తిరగరాస్తుంది అని ట్రేడ్ వర్గాలు సైతం ముందే చెప్పేస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కి సిద్ధం అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విడుదలకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో.. చిత్ర బృందం కూడా సినిమా ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో మొదలుపెట్టేసింది. సినిమాకి సంబంధించిన పోస్టర్లు పాటలు ఆల్రెడీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా నిన్న పాట్నా లో సినిమాకి సంబంధించిన థియట్రికల్ ట్రైలర్ ను కూడా విడుదల చేయగా.. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుతోంది. 


ఎంత స్టార్ హీరో సినిమా అయినా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో పుష్ప 2 ప్రమోషన్స్ కి కూడా 150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఈ మొత్తం ఖర్చు కేవలం సినిమాని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే పెట్టుకోవడం లేదు. ప్రమోషన్స్ కోసం అవుతున్న బడ్జెట్లో వేరే వాళ్ళ హస్తం కూడా ఉంది అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 


అసలు విషయం ఏమిటి అంటే సినిమాకి ఉన్న క్రేజ్ కారణంగా.. చాలా వరకు కార్పొరేట్ ఆర్గనైజేషన్లు కూడా సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఒక్కొక్క బ్రాండ్ సినిమా హోర్డింగ్స్, యాడ్స్ రూపంలో సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. తమ బ్రాండ్ ప్రమోషన్స్ తో పాటు సినిమా కూడా ప్రమోట్ అవుతోంది. ఒక్కొక్క కార్పొరేట్ సంస్థ దీనికోసం 10 కోట్లు కొందరు 20 కోట్ల దాకా డబ్బులు పెడుతున్నారట. 


ఈ రకంగా సినిమా ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలకి భారీ ఖర్చు తగ్గిపోయినట్లే. మరోవైపు ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నట్లే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ లో కూడా పుష్ప క్రేజ్ విపరీతంగా ఉంది. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ దీనికి నిదర్శనం. ఇక డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో ఎదురు చూడాలి.


Read more: Ram Gopal Varma: ఏపీ పోలీసులకు బిగ్ షాక్.. విచారణకు అందుకే రాలేనంటూ వాట్సాప్ మెస్సెజ్ చేసిన ఆర్జీవీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.