100కేజీల నుండి బ్యూటిఫుల్ హీరోయిన్గా.. స్ఫూర్తిని రగిలించే పోస్ట్
తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టకముందే ఆమె తనను తాను జయించింది.
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు, బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తనదైన మార్క్ చూపించారు. జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టతరమైన రోజుల నుంచి నేటి వరకు తాను ఎలా మారిందో చెప్పేలా కొన్ని ఫొటోల కొలేజ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. మీలోని అన్ని కోణాలు ఈ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాయని #SelfEmpower, #HelpsEmpower ట్యాగ్స్‌తో కామెంట్ చేశారు. ఎవరికి వారే సొంతంగా కష్టాలను అధిగమించి ముందు సాగాలని సూచించారు.
Also Read: మారుతీరావు అంత్యక్రియలు: అమృతకు భారీ షాక్
కాలేజీ రోజుల్లో దాదాపు 100 కేజీల బరువుండే తాను సినిమాల్లోకి రావాలన్న కోరికతో కష్టించారు. జిమ్‌లో గంటల తరబడి శ్రమించి ఇప్పుడున్న మాదిరిగా తన శరీరాన్ని మలుకున్న తీరు అమోఘం. తాను లావుగా ఉండటానికి కొన్ని అనారోగ్య సమస్యలు కారణమని గతంలో పలు సందర్భాలలో సారా అలీ ఖాన్ ప్రస్తావించడం తెలిసిందే. అయితే ఏదైనా సాధించాలంటే కఠోర శ్రమ, దీక్ష, పట్టుదల ఉంటే రాణించవచ్చునని చెప్పడానికి సారా అలీ ఖాన్‌ను ఓ ఉదాహరణగా చెప్పవచ్చు.
తప్పక చదవండి: జబర్దస్త్ ట్విస్ట్: దొరబాబు, పరదేశీ అలా బుక్కయ్యారా!
కాగా, కెరీర్ విషయానికొస్తే కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటించిన లవ్ ఆజ్ కల్ సినిమాతో చివరిసారి తెరమీద కనిపించారు. తాజాగా కూలీ నెంబర్ వన్ సినిమా షూటింగ్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్న సారా అలీ ఖాన్ తరచుగా తన విషయాలను ఫాలోయర్లతో షేర్ చేసుకుంటున్నారు. 1995లో వచ్చిన గోవిందా, కరిష్మా కపూర్ సినిమా కూలీ నెంబర్ 1 సినిమాకు తాజా సినిమా రీమేక్. ఈ సినిమాలో వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ జంటగా కనిపించనున్నారు.
See Pics: సెగలు రేపుతున్న రామ్ చరణ్ భామ