Inti No.13: మౌత్ టాక్‌తో రోజు రోజుకు థియేటర్స్ పెంచుకుంటున్న ఇంటి నెం. 13 మూవీ..
Inti No.13: హార్రర్ మూవీల్లో ఆకట్టుకునే కాన్సెప్ట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఇంటి నెంబర్ 13 మూవే సాక్ష్యం. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్ఫుల్ రన్ అవుతోంది. మౌత్ టాక్‌తో థియేటర్స్ల సంఖ్య కూడా పెరిగింది.
Inti No.13: సినిమాలో ఆకట్టుకునే కొత్తదనం ఉంటే ప్రేక్షకాదరణ తప్పక ఉంటుందని ప్రూవ్ చేసింది ఇంటి నెం.13. ఈ మధ్యకాలంలో ఓటీటీల హవా పెరిగిన తర్వాత థియేటర్స్‌కు వచ్చి మూవీలు చూసే ప్రేక్షకులు తగ్గిపోయారు. అలాంటిది మార్చి 1న రిలీజైన ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని అనూహ్యంగా థియేటర్స్‌లో చూడడానికి ఆడియన్స్ తరలి వస్తున్నారు. 72 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా ఇపుడు 120 స్క్రీన్స్‌కు పెరిగింది. మూవీకి పాజిటివ్ టాక్ రావడం. సినిమాలోని ట్విస్టులకు.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు.. డైరెక్టర్ టేకింగ్‌కి ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవడంతో కలెక్షన్లు కూడా భారీగా పెరిగాయి.
ఇంటి నెం 13 మూవీకి వస్తున్న రెస్పాన్స్ గురించి దర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ.. ‘మార్చి 1న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో బడా సినిమాలున్నాయి. మరోవైపు మాలాంటి స్మాల్ బడ్జెట్ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఇంత పోటీలో విడుదలైన ఇంటి నెంబర్ 13 సినిమాకి ఇంత మంచి టాక్ రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు. ఎంతో సైలెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఏరియాలోనూ సెకండ్ షోలు హౌస్ ఫుల్ అవ్వడం మాములు విషయం కాదు. ఇదే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందనడానికి రీజన్. ప్రేక్షకులు లేకపోయినా.. సినిమా సూపర్ హిట్ అయిందని మేము చెప్పుకోవడం లేదు. ఈ సినిమా 72 థియేటర్స్‌లో విడుదలై ఇపుడు 120 థియేటర్స్‌లో రన్ కావడం మాములు విషయం కాదు.
రిలీజ్ అయిన మొదటి రోజు, మొదటి షో నుంచే మౌత్ టాక్ బాగా రావడంతో సూపర్‌హిట్ అనే టాక్ వచ్చేసింది. ఒక ఏరియా అని కాకుండా సినిమా రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లో మంచి టాక్‌తో రన్ అవుతోంది. మా సినిమాకి ఇంత మంచి టాక్ రావడానికి సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయిన సస్పెన్స్, మిస్టరీ, ఎవరూ ఊహించలేని ట్విస్టులు ముఖ్య కారణమన్నారు. ఇవన్నీ సినిమాని సూపర్ హిట్ చేసాయన్నారు. వీటన్నింటికీ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడయ్యింది. ప్రేక్షకులు కూడా కొత్త అనుభూతికి లోనవుతున్నారు. సినిమాలో లెక్కకు మించిన గూస్‌బంప్స్ సీన్స్ ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు.
మల్టీప్లెక్స్ థియేటర్స్ ప్రేక్షకులు ఈ సినిమాలోని ఎలిమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వేరే సినిమాల్లో లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కలెక్షన్లపరంగా హై రేంజ్‌కి వెళ్ళిన సినిమా ఇదే అని దర్శకుడు పన్నా రాయల్ మీడియాకు తెలిపారు. ఇప్పుడు ఉన్న టాక్ చూస్తుంటే మా సినిమా డెఫినెట్‌గా ఇంకా పెద్ద రేంజ్‌కి వెళ్తుందన్ననమ్మకం పెరిగింది. థియేటర్లలో ప్రేక్షకుల రెస్పాన్స్‌ని ప్రత్యక్షంగా చూసిన నాకు ‘ఇంటి నెం.13’ చిత్రం హార్రర్ చిత్రాల్లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్, డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ పతాకాలపై పన్నా రాయల్ డైరెక్షన్‌లో హేసన్ పాషా నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం వినోద్ యాజమాన్య అందించారు. సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్ సమకూర్చారు.
Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.