Rashmika Mandann Responds To Marriage With Vijay Deverakonda; 'ఛలో' సినిమాతో కన్నడ అందం రష్మిక మందన్న టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. మొదటి సినిమానే హిట్ కావడంతో తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టారు. అందం, అభినయం ఉండడం కూడా రష్మికకు కలిసొచ్చింది. వచ్చిన అవకాశాలను ఒడిసిపడుతో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఇక 'గోల్డెన్ లెగ్' అనే ముద్ర ఉండడంతో దర్శకనిర్మాతలు రష్మిక డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్మిక మందన్న, విజయ్‌ దేవరకొండలు కలిసి నటించిన 'గీత గోవిందం' సినిమా తర్వాత వీరిద్దరూ లవ్‌‌లో ఉన్నారంటూ పుకార్లు మొదలయ్యాయి. ఆపై డియర్ కామ్రేడ్ సినిమా చేయడం, ఇద్దరు కలిసి బయట కనిపించడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూరింది. ముంబైలో వీరిద్దరూ తరచూ డిన్నర్‌ డేట్‌కు వెళ్లడం, ఈ న్యూయర్‌ వేడుకను కూడా ఒకేచోట జరుపుకోవడంతో రష్మిక-విజయ్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.


ఈ వార్తలపై విజయ్‌  దేవరకొండ అసహనం వ్యక్తం చేయగా.. తాజాగా రష్మిక స్పందించారు. శర్వానంద్, రష్మిక తాజాగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా రష్మిక పలు ఇంటర్య్వూలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో విజయ్‌తో వస్తున్న పెళ్లి రూమర్లపై తన అభిప్రయం చెప్పారు. 'ఆ వార్తలు నేను కూడా విన్నాను. కేవలం టైమ్ పాస్ రూమర్ మాత్రమే. వాటిని విని నవ్వుకోవటం తప్ప చేసేదేమీ లేదు. ప్రేమించి పెళ్లి చేసుకునేంత టైం నాకు లేదు. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను' అని రష్మిక చెప్పారు. 


రష్మిక మందన్న, విజయ్‌ దేవరకొండలు తమపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించినా.. వాటికి పులిస్టాప్ పడే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఇద్దరు కలిసి ఏ సినిమా చేయకున్నా.. తరచూ కలడమే. గతంలో కన్నడ యాక్టర్ రక్షిత్ శెట్టిని ప్రేమించిన రష్మిక.. అతడితో నిశ్చితార్థం కూడా చేసున్నారు. అయితే వారి ప్రేమ పెళ్లి పీటల దాకా వెళ్లలేదు. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌తో కలిసి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రం చేశారు. అలాగే 'పుష్ప 2'లోనూ నటించాల్సి ఉంది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయ‌న్‌తో కూడా ఓ  సినిమా చేస్తున్నారు. 


Also Read: Model Offer: ఉక్రెయిన్‌తో యుద్ధం చేయని వారితో పడుకోవడానికి సిద్ధం.. రష్యా సైనికులకు మోడల్ బంపర్ ఆఫర్!!


Also Read: Ashton Agar Death Threat: నీ భ‌ర్త ప్రాణాల‌తో తిరిగిరాడంటూ ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు.. భారత్ నుంచే మెసేజ్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook