‘పెంట’ కామెంట్‌పై యాంకర్ అనసూయ ఏమన్నారంటే!
anchor Anasuya: యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో తరచూ వేధింపులకు గురవుతున్నారు. తాజాగా మరోసారి అలాంటి వేధింపులపై ఫిర్యాదు చేశారు.
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఆందోళన చెందుతోంది. తరచుగా తనపై కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారని, తనని కించపరిచేలా దారుణమైన కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ సంస్థకు ఓ విన్నపం చేశారు. తనపై అసభ్య పోస్టులు చేస్తున్నారని, ఈ విషయాన్ని మీ దష్టికి తీసుకొస్తున్నానంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో మాకు నియమాలు, రూల్స్ ఉల్లంఘించినట్లు కనిపించలేదని ట్విట్టర్ నుంచి బదులు రావడం తెలిసిందే.
ఫొటో గ్యాలరీ: భారత్‌కు వచ్చిన మరో విదేశీ అందం అదితి
ట్విట్టర్ స్పందనపై అనసూయ అసంతప్తిగా ఉన్నారు. ‘మీ రూల్స్ సరి చూసుకోవాలని మనవి. వీటిని చూస్తే సైబర్ వేధింపులకు పాల్పడుతున్నారని గుర్తుపట్టలేరా. ఇలాంటి విషయాల్ని ఏమంటారు’ సార్ ఈ విషయాలు డీల్ చేసే వారికి ట్యాగ్ చేసి నాకు హెల్ప్ చేయాలని కోరుతూ సైబర్ క్రైమ్ పీఎస్ హైదరాబాద్ ట్విట్టర్‌కు ట్యాగ్ చేశారు. మీ ఫిర్యాదుపై స్పందించి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ పోలీసులు అనసూయ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.
ఫొటో గ్యాలరీ: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోలు
అనసూయ గారు మీరు పెంట మీద రాయి వేస్తున్నారు, ఇలాంటివి చేయవద్దంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అలాంటి చెత్త విషయాలకు మీలాంటి సెలబ్రిటీలు స్పందించవద్దు. 50 మంది చేసిన కామెంట్లకు స్పందిస్తే వేలాది నెటిజన్లకు విషయం చేరుతుంది. కనుక ఇలాంటివి లైట్ తీసుకోవాలని జబర్ధస్త్ యాంకర్ అనసూయకు ఉచిత సలహా కూడా ఇచ్చాడు.
ఆ నెటిజన్ ‘పెంట’ ట్వీట్‌పై అనసూయ స్పందించారు. లేదు సార్ అలా అనుకోవద్దు. కొందరికి గట్టిగా బుద్ధిచెబితే ఇలాంటివి చేయడానికి కాస్త భయం వేస్తుంది. ఎలాంటి చర్యలు తీసుకోకపోతేనే వేధించే వారి సంఖ్య 10 నుంచి ఆ సంఖ్య 100 మందికి పెరిగిపోతుంది. ఆడవారిపై అఘాయిత్యానికి పాల్పడే భవిష్యత్ నేరస్తులుగా మారతాయని అనసూయ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Also Read: సింగర్ చిన్మయికి షాక్.. నామినేషన్ తిరస్కరణ!