Jabardasth Anchor Sowmya Dance : దండం పెడతాం.. దయచేసి డ్యాన్స్ చేయకు!.. జబర్దస్త్ యాంకర్ సౌమ్యకు చేదు అనుభవం
Jabardasth Anchor Sowmya Rao Dance బుల్లితెరపై యాంకర్ సౌమ్యకు ఇప్పుడిప్పుడే మంచి డిమాండ్ అండ్ క్రేజ్ ఏర్పడుతోంది. అయితే ఈ కన్నడ అమ్మడికి తెలుగు రాదు. యాంకరింగ్ అంత కన్నా రాదు. ఇక డ్యాన్సుల్లోనూ ఈ అమ్మడికి అంత సీన్ లేదు.
Jabardasth Anchor Sowmya Rao Dance జబర్దస్త్ షోకు యాంకర్ అంటే సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అనసూయ, రష్మీలు గత కొన్నేళ్లు జబర్దస్త్ యాంకర్ అనే ట్యాగులతోనే సంపాదించుకున్నారు. ఇప్పుడంటే అనసూయ రేంజ్ మారిపోయింది కాబట్టి బుల్లితెరకు దూరంగా ఉంటోంది. కానీ రష్మీ మాత్రం తన ఫోకస్ అంతా కూడా బుల్లితెరపైనే పెట్టేసుకుంది. అందుకే తెలుగు నేర్చుకుంది. డ్యాన్సులు ప్రాక్టీస్ చేసింది. ఇలా యాంకరింగ్‌కు కావాల్సినవన్నీ ఇట్టే నేర్చుకుంది.
యాంకర్ అంటే తెలుగులో మాట్లాడటం, డ్యాన్సులను మ్యానేజ్ చేయడం వంటివి తెలిసి ఉండాలి. యాంకర్‌గా వర్షిణి ఫెయిల్ అయింది. ఆమెకు అంతగా డ్యాన్సులు రావు. ఇక విష్ణుప్రియ యాంకర్‌గా పర్వాలేదనిపించింది. శ్రీముఖి పర్ఫెక్ట్ యాంకర్ అని చెప్పొచ్చు. డ్యాన్సులు, పంచ్‌లు ఇలా ఏదైనా సరే శ్రీముఖి ఇచ్చి పడేస్తుంది.
ఇక ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ సౌమ్య డ్యాన్సుల మీద జనాలు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. సౌమ్యకు యాంకరింగ్ కూడా రాలేదు. ఆమెకు తెలుగు రాదు. కన్నడ సీరియల్ నటి. ఇక్కడ సీరియల్ చేసేందుకు వచ్చింది. ఓ ఈవెంట్‌లో ఆదికి పంచ్‌లు వేసి ఫేమస్ అయింది. దీంతో ఆమెను జబర్దస్త్ యాంకర్‌గా పట్టుకొచ్చింది మల్లెమాల టీం.
అయితే సౌమ్యకు తెలుగు రాదు.. డ్యాన్సులు రాదు.. వచ్చీ రానీ తెలుగులో ఆమె మాట్లాడే మాటలు కూడా ముద్దుగానే ఉండటంతో.. అంతో ఇంతో అందంగా ఉండటంతో.. నెట్టుకొచ్చేస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె మీద ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆమె షేర్ చేసిన రీల్ వీడియో ట్రోలింగ్‌కు గురవుతోంది. డ్యాన్సులు సరిగ్గా రావంటూ.. దయచేసి ఇంకో సారి డ్యాన్స్ చేయకు అంటూ జనాలు కామెంట్లుపెడుతున్నారు. దీంతో ఆమెకు చేదు అనుభవం ఎదురైనట్టు అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook