Jabardasth Emmanuel New Car : బుల్లితెరపై జబర్దస్త్ ఆర్టిస్టులు చేస్తున్న సందడి గురించి అందరికీ తెలిసిందే. స్మాల్ స్క్రీన్ టు బిగ్ స్క్రీన్ లేదంటే.. స్మాల్ స్క్రీన్ టు బిగ్ బాస్.. ఇలా బుల్లితెర తారలంతా బిజీగా ఉంటున్నారు. బుల్లితెర తారలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్‌ను వాడు వారుకుంటున్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు అయితే సొంత కార్లు కొనుక్కుంటూ హంగామా చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దసరా నాడు బుల్లితెర తారలు చాలా మందే కొత్త కార్లు కొనేశారు. పవిత్ర, రచ్చ రవి, షన్ను ఇలా చాలా మంది కొత్త కార్లు కొని.. తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక అంతే కాకుండా శివ జ్యోతి సైతం బెంజ్ కారు కొనేసింది. ఇప్పుడు జబర్దస్త్ ఇమాన్యుయేల్ కూడా ఆ లిస్ట్‌లోకి చేరాడు. తన కొత్త కారుని అందరికీ చూపించాడు. కల నెరవేరిందంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు అతను చేసిన పోస్ట్, అందులోని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


 



చివరకు నేను కన్న కల నిజమైంది.. నా లైఫ్‌లో అనుకోలేదు ఇలాంటి రోజు వస్తుందని.. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.. మీ అందరి ప్రేమ, మద్దతకు థాంక్స్ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఇమాన్యుయేల్. అయితే ఈ కొత్త కారు కొనే సందర్భంలో వర్ష కాకుండా రోహిణి కనిపించింది. మామూలుగా అయితే అందరూ వర్ష ఉంటుందని భావించి ఉంటారు.


కానీ వీరిద్దరూ కూడా ఆన్ స్క్రీన్ వరకే పరిమితం. ఆఫ్ స్క్రీన్‌లో వర్ష, ఇమాన్యుయేల్ కలిసి తిరుగుతున్నట్టుగా ఎక్కడా కనిపించదు. స్క్రీన్ మీద చేసేదంతా కూడా టీఆర్పీ కోసమే అని అందరికీ తెలిసిందే. ఈ జంటకు బుల్లితెర మీద మంచి డిమాండ్ ఉండటంతో.. టీఆర్పీ కోసం పిచ్చి పిచ్చి స్టంట్లు వేయిస్తుంటారు. ఇక అవన్నీ పక్కన పెడితే.. ఇమాన్యుయేల్ కొన్న కారు ధర దాదాపు ఇరవై లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.


Also Read : Rambha Family Car Accident : హీరోయిన్ రంభ ఫ్యామిలీకి ప్రమాదం.. కారు యాక్సిడెంట్‌తో హాస్పిటల్లో.. కూతురిపై ఎమోషనల్ పోస్ట్


Also Read : Manjima Mohan Lovestory : నా బతుకు అయిపోయిందన్న టైంలో వచ్చావ్!.. బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన మంజిమా మోహన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook