Jabardasth Varsha And Emmanuel : జబర్దస్త్ వర్ష, ఇమాన్యుయేల్ జోడికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై జబర్దస్త్ షోతో ఈ ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. జంటగా వేసిన స్కిట్లు, వారి రొమాంటిక్ ట్రాక్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. మధ్యలో ఈ జోడి చేసిన అతికి జనాలు చీదరించుకోవడం మొదలుపెట్టారు. దీంతో మధ్యలో జబర్దస్త్ షోలో వర్ష, ఇమాన్యుయేల్ ట్రాక్ తగ్గించారు. అన్నాచెల్లెళ్లుగా నటించేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో మాత్రం వర్ష, ఇమాన్యుయేల్ మీద రకరకాల వార్తలు వస్తుంటాయి. స్టేజ్ మీద, స్కిట్ల తరువాత వర్ష వేసే డైలాగ్స్, ఇమాన్యుయేల్ ఇచ్చే రియాక్షన్ల మీద నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు. మీమ్స్ వేస్తుంటారు. కానీ ఇద్దరి ట్రాక్ మాత్రం బుల్లితెరపై ట్రెండ్ అవుతూనే ఉంటుంది. వర్ష ఇమాన్యుయేల్ లవ్‌లో ఉన్నారంటూ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారంటూ రూమర్లు వస్తూనే ఉంటాయి.


 



బుల్లితెర తారలంతా కూడా సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్ అంటూ సందడి చేస్తుంటారు. జబర్దస్త్ వర్ష సైతం యూట్యూబ్ చానెల్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేసింది. ఈ చానెల్లలో ఎక్కువగా షాపింగ్ వీడియోలు షేర్ చేస్తుంటారు. అందులో నిజంగానే షాపింగ్ చేస్తారా? డబ్బులు పెట్టి కొంటారా?లేదంటే ఆ షాపింగ్‌కు అడ్వర్టైజ్ చేస్తుంటారా? అనే అనుమానాలు అందరిలోనూ ఉంటాయి.


తాజాగా వర్ష, ఇమాన్యుయేల్ ఇద్దరూ కూడా బంగారం, వెండి షాపులో సందడి చేశారు. ఇక ఈ వీడియోలో వర్ష మీద ఇమాన్యుయేల్ కౌంటర్లు వేశాడు. త్వరలోనే పెళ్లి, పిల్లలు అని మాట్లాడాడు. బర్త్ డే కంటే ముందే నీకు గిఫ్ట్ అంటూ వర్షకు పెద్ద నెక్లెస్, వడ్డాణం పెట్టాడు. కానీ దాన్ని నిజంగానే డబ్బులు పెట్టి కొన్నాడా? గిఫ్ట్గా ఇచ్చాడా? లేదంటే ఆ షాప్‌లో యాడ్‌ అంటూ ఇలా చేశారా? తెలియడం లేదు. మొత్తానికి ఇలాంటి వీడియోలు చేసి జనాలను పిచ్చోళ్లను చేసేందుకు బుల్లితెర తారలు మాత్రం బాగానే ప్రయత్నిస్తున్నారు.


Also Read :  Samantha Cries: అంతా అయిపోయింది అనిపించింది.. అరుదైన వ్యాధి గురించి చెబుతూ ఏడ్చేసిన సమంత!


Also Read : Bigg Boss Faima : నామినేషన్లో దిగజారుతూనే ఉన్నారు.. ఒళ్లు మరిచిపోతోన్న ఫైమా, శ్రీహాన్‌


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook