Jagapathi Babu Making Coffee  జగపతి బాబు ప్రస్తుతం సౌత్‌లో బిజీగా ఉండే స్టార్ విలన్. జగ్గూ భాయ్ అంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేసేస్తుంటాడు. లెజెండ్ సినిమాతో విలన్‌గా మారిన జగపతి బాబు.. హీరోగా ఉన్న సమయంలో కంటే ఎక్కువగా సంపాదించేస్తున్నాడట. ఆ విషయాన్ని స్వయంగా జగపతి బాబుయే చెబుతుంటాడు. హీరోగా ఉన్నప్పుడు తీసుకున్న దాని కంటే విలన్‌గానే ఎక్కువగా తీసుకుంటున్నట్టు తెలిపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం జగపతి బాబు కూడా అన్నీ ఒక రకమైన తరహా పాత్రల్లో కనిపిస్తున్నాడు. జగపతి బాబు అంటే స్టైలీష్ విలన్, విలనిజంలోనూ ఒకే మొనాటినీ చూపిస్తున్నాడంటూ ఇలా కామెంట్లు వినిపించాయి. ఆ మధ్య జగపతి బాబుకు ఆఫర్లు కూడా తగ్గిపోయాయ్ అని కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు జగపతి బాబు చేతిలో పలు సినిమాలు, వెబ్ సిరీస్లు ఉన్నట్టు తెలుస్తోంది.


 



ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ చిత్రంలో అయితే జగపతి బాబు లుక్ అదిరిపోయింది. ఇంత వరకు ఆయన పాత్రకు సంబంధించిన మరో అప్డేట్ అయితే రాలేద. ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం అదిరిపోయింది. జగపతి బాబు ఖాళీగా ఉన్న సమయంలో ఇంట్లో ఇలా సరదా సరదాగా ఉంటున్నాడు. ఆ మధ్య తలకిందులుగా వేలాడుతున్న ఫోటోను షేర్ చేశాడు. తలకిందులుగా ఉండి చూస్తే అయినా ప్రపంచం అర్థమవుతుందా? అని ఇలా చూస్తున్నాను అని నవ్వించేశాడు.


ఇప్పుడు జగ్గూ భాయ్ మరో వీడియోను షేర్ చేశాడు, ఇన్ స్టంట్ కాఫీ మిషన్‌లో కాఫీ తయారు చేయడం నేర్చుకున్నాడట ఈ అరవై ఏళ్లలో ఇప్పుడు అదే తనకు రమ్ము, విస్కీ ఇలా అన్నీ కూడా ఆ కాఫీయేనట. ఇది ఎవ్వరికీ పెట్టకండి.. ఎవ్వరూ తాగలేరు అంటూ చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు.


Also Read : Pawan Kalyan Sujeeth Movie : పవన్ కళ్యాణ్‌ సుజిత్ సినిమా.. మంచు మనోజ్ ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్‌లో చీలికలు


Also Read : Venkatesh Daughter Ashritha : మరదలితో నాగ చైతన్య సందడి.. వెంకీ మామ కూతురి పోస్ట్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook