Pawan Kalyan Sujeeth Movie : పవన్ కళ్యాణ్‌ సుజిత్ సినిమా.. మంచు మనోజ్ ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్‌లో చీలికలు

Manchu Manoj Reacts on Pawan Kalyan Sujeeth Movie మంచు మనోజ్ తాజాగా ట్వీట్ వేశాడు. అందులో పవన్ కళ్యాణ్‌ సుజీత్ సినిమా మీద రియాక్ట్ అయ్యాడు. సినిమా గురించి మనోజ్ వేసిన ట్వీట్ మెగా అభిమానుల మధ్య చీలిక పెట్టినట్టుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2022, 01:25 PM IST
  • నెట్టింట్లో పవన్ కళ్యాణ్‌ సుజీత్ సినిమా సందడి
  • మంచు మనోజ్ ట్వీట్‌తో మొదలైన చర్చలు
  • పవర్ స్టార్, మెగా ఫ్యాన్స్ మధ్య చీలికలు
Pawan Kalyan Sujeeth Movie : పవన్ కళ్యాణ్‌ సుజిత్ సినిమా.. మంచు మనోజ్ ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్‌లో చీలికలు

Manchu Manoj Reacts on Pawan Kalyan Sujeeth Movie : మంచు వారికి మెగా వారికి మధ్య పెరిగిన దూరం అందరికీ తెలిసిందే. మంచు మనోజ్‌ అయితే పవన్ కళ్యాణ్‌ మీద ప్రేమను కురిపిస్తుంటాడు. మెగా హీరోలతో మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తుంటాడు. కానీ మంచు వారికి మెగా ఫ్యామిలీకి మధ్య ఎప్పుడూ కనిపించిన దూరం మాత్రం ఉంటూనే ఉంటుంది. అయితే తాజాగా మంచు మనోజ్ వేసిన ట్వీట్‌తో పవర్ స్టార్, మెగా ఫ్యాన్స్ మధ్య చీలికలు ఏర్పడ్డట్టు కనిపిస్తోంది.

 

మామూలుగానే ప్రస్తుతం మెగా ఫ్యాన్స్.. చిరు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ ఇలా విడిపోయారు. ఇప్పుడు మంచు మనోజ్ పెట్టిన ట్వీట్‌తో పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య కాకరేపినట్టు అయింది. చిరంజీవి, రామ్ చరణ్‌లకు అవార్డులు వస్తే ట్వీట్ వేయలేదు గానీ.. పవన్ కళ్యాణ్‌ కొత్త సినిమా మీద ట్వీట్ వేస్తావా?.. పీకే ఫ్యాన్స్ అంత పిచ్చోళ్లు కాదు? అని ఓ మెగా అభిమాని ట్వీట్ వేశాడు.

 

దీనికి పవర్ స్టార్ ఫ్యాన్ ఇలా రిప్లై ఇచ్చాడు. మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు.. వాళ్ల గురించి వేయకపోతే అది మా తప్పా?.. నువ్ నిన్న పవన్ కళ్యాణ్‌ సినిమా గురించి ట్వీట్ వేశావా? అని రివర్స్‌లో ప్రశ్నించాడు. ఇక ఇదే కాకుండా చిరంజీవి, రామ్ చరణ్‌, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా నిన్న పవన్ కళ్యాణ్‌ సుజిత్ సినిమా ప్రకటన మీద ట్రోల్స్ చేశారట. దీంతో మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్న చీలికలు ఇలా బయటపడ్డాయి.

 

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కొందరు రామ్ చరణ్‌ మూవీని ట్రోల్స్ చేశారట.. రామ్ చరణ్‌ ఫ్యాన్స్ కొందరు పవన్ కళ్యాణ్ సినిమా మీద ట్రోల్స్ వేశారట.. ఇలా సినిమాల నుంచి టాపిక్ రాజకీయాలకు కూడా మల్లింది. మొత్తానికి రామ్ చరణ్‌, చిరంజీవి ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఇలా తిట్టేసుకుంటున్నారు.

Also Read : Venkatesh Daughter Ashritha : మరదలితో నాగ చైతన్య సందడి.. వెంకీ మామ కూతురి పోస్ట్ వైరల్

Also Read : Bandla Ganesh : పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ అసంతృప్తి.. నిర్మాతగా సినిమా చాన్స్ ఇవ్వకపోవడంతో ట్వీట్ వేశాడా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News