Jailer Movie Villain Vinayakan Remuneration: సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం 'జైలర్'. నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ రూ.600 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఆడియో రైట్స్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే ఈ సినిమా వసూళ్లు వెయ్యి కోట్లు దాటినట్లే. ఈ మూవీ ఎనలేని లాభాలను తెచ్చిపెట్టడంతో ప్రొడ్యూసర్ కళానిధి మారన్ హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌లకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఈ సినిమాలో రజనీని ఢీకొట్టే పాత్రలో నటించిన మలయాళ నటుడు వినాయకన్ రెమ్యూనరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాఫిక్ గా మారింది. ఈ మూవీకి ఆయన చాలా తక్కువ పారితోషకం తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలర్ సినిమా కోసం వినాయకన్ 35 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో రీసెంట్ గా ఈ విషయంపై ఆయన ఓ ఇంటర్య్యూలో మాట్లాడారు. ''నిర్మాతలు ఈ వార్త వినకపోతే అదే చాలు. నాకు 35 లక్షలు ఇచ్చారన్న వార్తలు ఎలాంటి నిజం లేదు. ఈ ఫేక్ న్యూస్ ను కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారు. నేను అడిగినంత నిర్మాతలు ఇచ్చారు. అంతేకాకుండా సెట్ లో నన్ను చాలా భాగా చూసుకున్నారు'' అని వినాయకన్ చెప్పుకొచ్చారు.  


డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన వినాయకన్ ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించాడు. మలయాళంలో ‘'కమ్మటిపదం’' సినిమాలో ఆయన నటనకు ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. ఈ చిత్రానికి ఆయన ఫిలింఫేర్, కేరళ రాష్ట్ర అవార్డులు కూడా అందుకున్నారు. 2006లో వచ్చిన 'తిమిరు' సినిమాతో ఆయన కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ నుంచి ఆయన తిరుగు చూసుకులేదు. పైగా ఇతడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా. 


Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFaceboo