Sankranti movies: సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్స్ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆ సినిమాకి మాత్రమే అన్యాయం..!

Andhra Pradesh government: సంక్రాంతి అంటే.. సినిమా పండగ అనేది ఎంతోమంది సినీప్రియలో అభిప్రాయం. ఎందుకు తగ్గట్టుగానే.. స్టార్ హీరోలందరూ సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకోవడానికి ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. ఇక ఇదే సీన్ ఈసారి సంక్రాంతికి కూడా రిపీట్ కానుంది. ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఈ సంక్రాంతికి సందడి చేయనున్నాయి.  

1 /9

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మూడు ప్రధాన చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఒకటి రామ్ చరణ్ గేమ్ చేంజర్ కాగా.. మరో రెండు బాలకృష్ణ డాకూ మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు.  

2 /9

ఈ మూడు సినిమాల పైన కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మధ్య తెలంగాణలో జరిగిన పుష్ప ఇన్సిడెంట్ వల్ల.. ఈ సినిమా టికెట్ హైక్స్ ఎలా ఉంటాయి అని గత కొద్ది రోజుల నుంచి చర్చ మొదలయింది.  

3 /9

అసలు బెనిఫిట్ షోలు ఉంటాయా.. టికెట్ రేట్లు పెరుగుతాయా అని తెలంగాణ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సంక్రాంతి సినిమాలకు భారీ ఆఫర్ ప్రకటించింది.  

4 /9

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఈ సినిమాల టికెట్ ధరలను భారీగా పెంచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం పండుగ వేళ సినీ రంగంలో ప్రత్యేక చర్చలకు దారితీసింది.  

5 /9

రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ సంక్రాంతి సీజన్‌లో అత్యంత భారీ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమా టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 135, మల్టీప్లెక్స్‌లలో రూ. 175గా నిర్ణయించారు. అదనంగా, 1 గంటకే ప్రారంభమయ్యే బెనిఫిట్ షోలకు రూ. 600 (జీఎస్టీతో సహా) టికెట్ ధరను ఆమోదించారు. ఈ నిర్ణయంతో సినిమా విడుదల రోజు భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.  

6 /9

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘డాకూ మహారాజ్’ సినిమా టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 110, మల్టీప్లెక్స్‌లలో రూ. 135గా పెంచడం జరిగింది. ఈ చిత్రానికి తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షోలను ఏర్పాటు చేయడంతోపాటు, వాటి టికెట్ రేటు రూ. 500 (జీఎస్టీతో సహా)గా నిర్ణయించారు. ఈ సినిమా అభిమానులలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.  

7 /9

వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి కూడా టికెట్ ధరలను పెంచే నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 75, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 టికెట్ ధరను నిర్ణయించారు. ఈ సినిమాలో వినోదాత్మక అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయనే అంచనాలు ఉన్నాయి.  అయితే మూడు సినిమాల్లోకి ఈ సినిమాకి టికెట్ రేట్లు ప్రభుత్వం కొంచెం తక్కువగా ప్రకటించింది. కానీ బడ్జెట్ రీత్యా మూడు సినిమాల టికెట్ రేట్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది.  

8 /9

ఈ మూడు చిత్రాలకు భారీ టికెట్ ధరలు నిర్ణయించడం వల్ల ప్రారంభ వసూళ్లు అద్భుతంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలంటే కంటెంట్ కీలకమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పండుగ సీజన్‌లో వినోదం కోసమని ప్రేక్షకులు టికెట్ ధరలను పట్టించుకోకుండా థియేటర్లకు తరలి వస్తారని విశ్వసిస్తున్నారు.  

9 /9

ఈ మూడు సినిమాలలో ఏది సంక్రాంతి విజేతగా నిలుస్తుందనే ఆసక్తి ప్రేక్షకులలో ఉంది. సినిమా కథ, ప్రదర్శన, సంగీతం వంటి అంశాలు విజయం సాధించేందుకు ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. పండుగ సీజన్‌లో ఈ నిర్ణయం తెలుగు సినిమా రంగంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని చెప్పవచ్చు.