Avatar 2 Day 1 Collections అవతార్ 2 సినిమా కోసం ప్రపంచమంతా ఎదురుచూసిన అందరికీ తెలిసిందే. అవతార్ చూసిన వారంతా కూడా పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. దశాబ్దాల కల నిన్న నెరవేరింది. అవతార్ 2 సినిమాలో జేమ్స్ కామెరాన్ ఇంకా ఎలాంటి అద్భుతాలు చేశాడా? అని అందరూ ఆశగా థియేటర్లోకి వెళ్లారు. అలాంటి వారు కాస్త నిరాశపడ్డారు. కథ పరంగా కొత్తగా ఏమీ లేదని, కానీ విజువల్స్ మాత్రం నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి సినిమాను ఇంకా ఎవ్వరూ తీయలేరని, ఇంకో దశాబ్దం అయినా కూడా ఆ విజువల్స్ తీయడం ఎవ్వరి వల్లా కాదని, అసలు అలాంటి విజన్ ఎవ్వరికీ రాదని జేమ్స్ కామెరాన్‌ను పొగిడేస్తున్నారు. అయితే అవతార్ 2 కథను చూస్తే తెలుగులో ఇలాంటి ఎన్నో సినిమాలున్నాయని అందరికీ గుర్తుకు వస్తుంటాయి. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కథలకు కొదవేలేదని అనిపిస్తుంది. కానీ కథ పాతదే అయినా ఎంచుకున్న నేపథ్యం, తెరకెక్కించిన తీరుకు సలాం కొట్టేస్తున్నారు.


కథ, కథనాలను పక్కన పెట్టేసి అవతార్ 2 సినిమాను ఒక్కసారైనా చూడాల్సిందే అని అంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. సినిమా మొత్తం ఆన్ లైన్‌లో ఒక్క రోజు ముందే లీక్ అయింది. అయినా కూడా ఇది థియేటర్‌లో అనుభూతి చెందాల్సిన సినిమా. అందుకే జనాలు ఈ లీక్‌ను అంతగా పట్టించుకోవడం లేదు. థియేటర్లోనే చూడాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందని అంతా అనుకున్నారు.


అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా భారత్‌లో మొదటి రోజు రూ. 65 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ రికార్డును అవతార్ 2 చెరిపేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అవతార్ 2 మాత్రం దగ్గరదగ్గరగా రూ. 50 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టేలా కనిపిస్తోంది. పూర్తి కలెక్షన్ల వివరాలు తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే


Also Read : Kalyaan Dhev : ఓపిగ్గా ఉంటే.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది!.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్


Also Read : Kovai Sarala Getup : కోవై సరళ ఏంటి ఇలా మారిపోయింది.. పాత్ర కోసం మరీ ఇలానా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook