Kalyaan Dhev : ఓపిగ్గా ఉంటే.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది!.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్

Kalyaan Dhev Movies కళ్యాణ్ దేవ్ సినిమా కెరీర్ సమాప్తమైనట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు కళ్యాణ్‌ దేవ్ చేతిలో ఒక్క సినిమా కూడా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఆయన నటించిన రెండు చిత్రాలు వచ్చినట్టుగా వెళ్లినట్టుగా కూడా ఎవ్వరికీ తెలియడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2022, 07:49 PM IST
  • నెట్టింట్లో యాక్టివ్‌గా కళ్యాణ్ దేవ్
  • విడాకులపై ఇంకా నోరు విప్పని జంట
  • వేర్వేరుగానే ఉంటోన్న శ్రీజ, కళ్యాణ్
Kalyaan Dhev : ఓపిగ్గా ఉంటే.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది!.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్

Kalyaan Dhev Latest Quotation కళ్యాణ్‌ దేవ్‌కు మెగా అల్లుడిగానే పేరు ఉంది. ఆ ట్యాగ్‌తోనే సినిమాల్లోకి వచ్చాడు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకున్నాకే కళ్యాణ్ దేవ్ వెలుగులోకి వచ్చాడు. విజేత సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే రెండో సినిమా, మూడో సినిమా విడుదలయ్యే టైంకు కళ్యాణ్‌ దేవ్ మెగా ఫ్యామిలీ మధ్య రిలేషన్ చెడినట్టు కనిపిస్తోంది. మెగా అల్లుడు అనే ట్యాగ్‌కు కళ్యాణ్ దేవ్ దూరమైనట్టుగా అనిపిస్తుంది.

శ్రీజ కళ్యాణ్ అని ఉన్న ఇన్ స్టా హ్యాండిల్‌ను శ్రీజ కొణిదెలగా మార్చుకుంది చిరు చిన్నకూతురు. అప్పటి నుంచి ఈ ఇద్దరి విడాకుల రూమర్లు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. శ్రీజ, కళ్యాణ్‌లు విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారనే రూమర్లు వచ్చినా ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆమె తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్ పేరులో కళ్యాణ్‌ని తొలగించి కొణిదెల అని పెట్టుకున్నప్పుడు విడాకుల రూమర్లు నిజమే అని అంతా ఫిక్స్ అయ్యారు.

ఇక కళ్యాణ్‌ దేవ్ నటించిన సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలకు మెగా సపోర్ట్ దక్కలేదు. దీంతో ఆ రెండు చిత్రాలు ఎప్పుడు వచ్చాయి.. ఎప్పుడు వెళ్లాయి అనే విషయం జనాలకు తెలియకుండాపోయింది. ఇప్పుడు కళ్యాణ్‌ దేవ్ చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. చూస్తుంటే కళ్యాణ్‌ దేవ్ ఇక సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండేట్టు కనిపిస్తోంది. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

అయితే ఇంత వరకు కూడా ఈ విడాకుల రూమర్ల మీద స్పందించలేదు. విడాకులు తీసుకున్నట్టుగా అధికారికంగా స్పందించలేదు. శ్రీజ, కళ్యాణ్‌ ఇద్దరూ కూడా ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటున్నారు. కానీ నవిష్క విషయంలో మాత్రం ఈ ఇద్దరూ కాస్త కాంప్రమైజ్ అవుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఆ మధ్య నవిష్క అయితే శ్రీజ వద్దే కనిపించేది. కానీ ఇప్పుడు కళ్యాణ్‌ దేవ్ వద్ద కూడా కనిపిస్తోంది.

కళ్యాణ్‌ దేవ్ ప్రస్తుతం నెట్టింట్లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్లకు వెళ్తున్నాడు. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా కళ్యాణ్‌ దేవ్ వేసిన పోస్ట్, చెప్పిన కొటేషన్ వైరల్ అవుతోంది. ఓపిగ్గా ఉండు.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఇది ఏ ఉద్దేశ్యంలో వేశాడో అతనికే తెలియాలి.

Also Read : Kovai Sarala Getup : కోవై సరళ ఏంటి ఇలా మారిపోయింది.. పాత్ర కోసం మరీ ఇలానా?

Also Read : Jabardasth Anchor Sowmya : యాంకర్ రష్మీకే ఎసరు పెట్టేసింది.. దుమ్ములేపేసిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News