Kovai Sarala Getup : కోవై సరళ ఏంటి ఇలా మారిపోయింది.. పాత్ర కోసం మరీ ఇలానా?

Kovai Sarala Getup కోవై సరళా అంటే మన తెలుగు వారికి కమెడియన్‌గానే తెలుసు. కానీ ఆమెలో ఓ సీరియస్ నటి ఉందని, ఆమె నటిస్తే మనకు ఏడుపు వస్తుందని చాలా మందికి తెలియదు. తాజాగా అలాంటి ఓ ఎమోషనల్ పాత్రలో కోవై సరళా కనిపించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2022, 06:53 PM IST
  • ఆశ్చర్యపరిచిన నటి కోవై సరళ
  • సెంబి ట్రైలర్ నెట్టింట్లో వైరల్
  • కోవై సరళ లుక్‌పై చర్చలు
Kovai Sarala Getup : కోవై సరళ ఏంటి ఇలా మారిపోయింది.. పాత్ర కోసం మరీ ఇలానా?

Kovai Sarala Getup in Sembi కోవై సరళా తెలుగు ఆడియెన్స్‌ను ఒకప్పుడు ఎంతగానో నవ్వించింది. బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్‌ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అన్నట్టుగా నవ్వించేశారు. అయితే ఇప్పుడు కోవై సరళా తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. మన దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదో.. ఆమె కావాలని తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోందో తెలియడం లేదు గానీ.. ఆమె మాత్రం ఇప్పుడు టాలీవుడ్‌కు దూరంగానే ఉంది.

కోలీవుడ్‌లో అడపాదడపా చిత్రాలు చేస్తోంది. రాఘవ లారెన్స్ తీసే కాంచన సినిమాల్లో కనిపిస్తోంది. ఇక అప్పుడెప్పుడు రెబల్ అంటూ కాస్త నవ్వించే ప్రయత్నం చేసింది. అది కూడా లారెన్స్ దర్శకత్వం వహించిన సినిమానే. అయితే కోవై సరళ నవ్వించడం మాత్రమే కాదు అందరినీ ఏడిపిస్తుందని,ఆలోచింపజేసేలా చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ తాజాగా కోవై సరళా అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News