జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్ల విషయంలో రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరో వివాదం ఆయన్ని చుట్టుముడుతోంది. ఇప్పటికి ఇద్దరు భార్యలకు విడాకులిచ్చిన పవన్ కళ్యాణ్..మూడవ భార్యకు కూడా విడాకులిచ్చినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనసేనాని పవన్ కళ్యాణ్ మొదటి ఇద్దరు భార్యలకు విడాకులిచ్చి మూడవ భార్యగా రష్యన్ మహిళ అన్నా లెజినోవాను 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతకుముందు 1997లో విశాఖపట్నంకు చెందిన నందినిని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ కొంతకాలానికే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత 2009లో నటి రేణు దేశాయ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కానీ 2012 నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఇప్పుుడు గత కొద్దికాలంగా మూడవ భార్య అన్నా లెజినోవాతో కూడా దూరంగానే ఉంటున్నారు. 


పవన్ కళ్యాణ్‌తో మనస్పర్ధల కారణంగా విడిపోయి దూరంగా సింగపూర్‌లో ఉంటున్నట్టు నేషనల్ మీడియా తెలిపింది. పవన్ కళ్యాణ్‌తో విడాకుల విషయమై తుది నిర్ణయం తీసుకునే వరకూ పరిస్థితి వచ్చినట్టుగా సమాచారం. ఇందులో నిజమెంత ఉందో తెలియదు గానీ సోషల్ మీడియాలో బాగా ప్రచారమౌతోంది. తుది నిర్ణయం తీసుకున్న తరువాత రష్యాకు వెళ్లిపోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇదంతా సోషల్ మీడియాలో, జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఎంతవరకూ నిజమో తెలియదు.


ఈ పుకార్లకు బలం చేకూరేవిధంగా ఇటీవలికాలంలో ఎక్కడా, ఏ వేడుకలోనూ పవన్ కళ్యాణ్‌తో అన్నా లెజినోవా కన్పించడం లేదు. వారాహి యాత్ర సందర్బంగా కూడా కన్పించలేదు. మెగా కుటుంబానికి సంబంధించిన అతి ముఖ్యమైన వేడుకల్లో పవన్ ఒక్కరే హాజరౌతున్నారు కానీ అన్నా లెజినోవా కన్పించడం లేదు. ఇటీవల జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధం, రామ్ చరణ్-ఉపాసనలకు కూతురు పుడితే చూసేందుకు సైతం పవన్ కళ్యాణ్ ఒక్కరే హాజరయ్యారు. అందుకే ఇప్పుడు మూడవ భార్య లెజినోవాకు విడాకులు ఇస్తున్నారనే వార్త అంత బలంగా వ్యాపిస్తోంది. 


Also read: Nikhil Siddhartha: స్పై రిజ‌ల్ట్‌ ఎఫెక్ట్.. ఫ్యాన్స్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన హీరో నిఖిల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook