Janhvi Kapoor Devara : లెజెండరీ నటి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వి కపూర్.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నిజానికి జాన్వి కపూర్ సినిమాల్లోకి రాక ముందు వరకు.. అందరూ శ్రీదేవి కూతురు కాబట్టి ఇండస్ట్రీలో ఆఫర్లు తెచ్చుకుంటుందని.. నటన రాకపోయినా ఇండస్ట్రీలో ఎలాగాలో నెట్టుకువస్తుందని కామెంట్లు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ మొదటి సినిమా ధడక్ తోనే ఆమె అందరికీ షాక్ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న జాన్వి కపూర్.. ఆ తరువాత కూడా కేవలం మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. మిగతా హీరోయిన్స్ లాగా స్టార్ హీరోలతో సినిమాలు చేసేస్తూ.. నాలుగైదు ఆఫర్లు వెనకేసుకోకుండా.. జాన్వీ కపూర్ తనంతట తానుగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. 


గుంజన్, రూహీ, గుడ్ లక్ జెర్రీ ఇలా ఫిమేల్ ఓరియంటల్ చిత్రాల్లో కూడా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి ప్లానింగ్ తో వరుసగా ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన జాన్వి కపూర్ ఇటు టాలీవుడ్ లో కూడా ఇప్పుడు అడుగు పెట్టడానికి సిద్ధం అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 


దేవర సినిమాతో జాన్వి కపూర్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. ఈ విషయంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురుని తెలుగు తెరపై చూడాలని తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎలాగైతే హిందీలో కేవలం పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసింది.. అలానే తెలుగులో కూడా చేస్తుందా అని తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు.


శ్రీదేవికి తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. మరి అలాంటి శ్రీదేవి కూతురు బాలీవుడ్ లో ఎలాగైతే కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాలుగా నటించింది అలానే తెలుగులో కూడా నటిస్తుందని భావిస్తున్నారు అందరూ. కేవలం హీరోయిన్ అంటే పాటలు అనే లాగా కాకుండా.. తన పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో కనిపించి తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ ఇటు తెలుగులో కూడా శ్రీదేవి లాగా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందో లేదా చూడాలి. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు హిట్ అయితే కచ్చితంగా జాన్వీ కపూర్ టాలీవుడ్ నుండి మరిన్ని ఆఫర్లు అందుకుంటుంది అని చెప్పుకోవచ్చు.


Also read: Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి