Priyadarshi fires on Air India కమెడియన్, హీరో, నటుడు, విలన్ ఇలా ఏ రోల్ ఇచ్చినా కూడా అదరగొట్టే సత్తా ఉన్న వాడే ప్రియదర్శి. అతి తక్కువ కాలంలోనే ప్రియదర్శి తన మార్క్ చూపించాడు. పెళ్లి చూపులు సినిమాలో నవ్వించినా, మల్లేశం సినిమాలో ఏడిపించినా అది ప్రియదర్శికే దక్కింది. ఇక జాతి రత్నాలు సినిమాతో పీక్స్‌కు చేరింది. ఇప్పుడు ప్రియ దర్శి హీరోగా ఓ సినిమా రెడీ అవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో వేణు టిల్లు దర్శకత్వంలో బలగం అనే సినిమాలో హీరోగా ప్రియదర్శి నటిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రియదర్శి సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా ఉంటాడు. తన ఫ్రెండ్స్ చేసే ట్వీట్ల మీద కౌంటర్లు వేస్తుంటాడు. సామాజిక సమస్యల మీద తన స్టైల్లో కౌంటర్లు వేస్తుంటాడు. ఇక తాజాగా తనకు రావాల్సిన డబ్బులు వసూల్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నాడు. ప్రియదర్శి తాను ఓ ఫ్లైట్‌ టికెట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడట. కానీ ఇంత వరకు రీ ఫండ్ అమౌంట్ రానేలేదట. దీనిపై అడిగి అడిగి విసుగు చెందాడట. ఈ మేరకు ప్రియ దర్శి వేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.


ఎయిర్ ఇండియా టికెట్‌ను క్లియర్ ట్రిప్ అనే యాప్ ద్వారా బుక్ చేసుకున్నాడట. ఆ రెంటిని ట్యాగ్ చేసి నిలదీశాడు ప్రియదర్శి. జనవరి 15న ప్రయాణించాల్సిన టికెట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాను.. ఇంత వరకు దాని రీఫండ్ అమౌంట్ మీరు నాకు ఇవ్వలేదు.. నాకు సహనం కోల్పోయింది.. రీ ఫండ్ అమౌంట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను అంటూ ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.


 



ప్రియదర్శి ట్వీట్‌కు క్లియర్ ట్రిప్ సంస్థ స్పందించింది. ఎండోర్స్మ్ంట్ కాపీ, సిగ్నేచర్, ఎయిర్ ఇండియా స్టాంప్ ఇవన్నీ ఉండాలి.. అప్పుడే మేం ముందుకు వెళ్లగలం అని చెప్పుకొచ్చింది. ఆ సంస్థ వేసిన ట్వీట్ మీద మళ్లీ స్పందించాడు ప్రియదర్శి. నేను ఫిబ్రవరి 2వ తేదీన మీరు చెప్పినవన్నీ చేశాను.. కానీ మీరు ఇంత వరకు చూడలేదు.. మీకు ఎన్నో మెసెజ్‌లు చేశాను. కాల్స్ చేశాను.. కానీ పట్టించుకోలేదు.. మీరు ఎయిర్ ఇండియాను కాంటాక్ట్ అయ్యారా? నాకు తెలిసు మీరు కాలేదు అంటూ నిలదీశాడు. మరి ప్రియదర్శి డబ్బులు ఇప్పటికైనా వస్తాయా? లేదా? అన్నది చూడాలి.


Also Read:  manchu Lakshmi at Varanasi : వాలెంటైన్స్ డే.. వారణాసిలో మంచు లక్ష్మీ.. ట్వీట్ వైరల్


Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook