Rahul Ramakrishna Wife Pregnant : తండ్రి కాబోతోన్న రాహుల్ రామకృష్ణ.. వెరైటీగా ప్రకటన.. నెటిజన్ల ట్వీట్లు వైరల్
Rahul Ramakrishna Wife Pregnant రాహుల్ రామకృష్ణ హరితల లవ్ స్టోరీ, డేటింగ్, లివింగ్ రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తాను తండ్రిని కాబోతోన్నట్టుగా రాహుల్ రామకృష్ణ ప్రకటించాడు.
Rahul Ramakrishna Wife Pregnant : రాహుల్ రామకృష్ణ తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రిని కాబోతోన్నట్టుగా ప్రకటించాడు. రాహుల్ రామకృష్ణ తండ్రి కాబోతోన్నట్టుగా ప్రకటిస్తూ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.తన భార్య గర్భాన్ని చూపిస్తూ మా చిన్ని నేస్తానికి హలో చెప్పండి అంటూ అసలు విషయాన్ని ప్రకటించాడు. తమ జీవితాల్లోకి ఆనందం రాబోతోందని, త్వరలోనే తాను తండ్రిని కాబోతోన్నట్టుగా చెప్పేశాడు. ఇక ఈ ట్వీట్ మీద జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. కంగ్రాట్స్ చెబుతూ సందడి చేస్తున్నారు.
కంగ్రాట్స్ అంటూ నెటిజన్ల ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. పార్టీ లేదా? పుష్ప అంటూ సెటైర్లు వేస్తున్నారు. అన్నా.. వదినతో పని చేయించకు జాగ్రత్త చూసుకో అంటూ సలహాలు ఇస్తున్నారు. అన్న నైట్ ఉద్యోగం చేసినట్టు లేదు.. ఉద్యమం చేసినట్టున్నాడు అంటూ ఇలా ఫన్నీగా ట్వీట్లు వేస్తున్నారు. అయితే రాహుల్ పెళ్లి మాత్రం ఎప్పుడు జరిగిందనే సంగతి మాత్రం సస్పెన్స్‌గానే ఉంటుంది. పెళ్లి చేసుకున్నారా? లేదా ఇంకా లివింగ్ రిలేషన్ షిప్‌లోనే ఉన్నారా? అన్నది తెలియడం లేదు.
కానీ గత నెలలో మాత్రం రాహుల్ ఓ పోస్ట్ వేశాడు. తన భార్య అంటూ అందరికీ పరిచయం చేశాడు. ఆ సమయంలోనే రాహుల్ పెళ్లి గురించి చర్చలు జరిగాయి. అసలు నీకు పెళ్లి ఎప్పుడు అయింది అన్నా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు ఏకంగా తండ్రిని కాబోతోన్నట్టుగా ప్రకటించేశాడు. మొత్తానికి రాహుల్ మాత్రం ఫుల్ స్పీడు మీదున్నాడని అంతా అనుకుంటున్నారు.
Also Read : Adipurush Release Date : ఆదిపురుష్ వెనక్కి.. సంక్రాంతి రేస్ నుంచి అవుట్.. వంద కోట్లతో రిపేర్లు?
Also Read : Bigg Boss Geetu Elimination : ఎంత ఏడ్చినా ఏమీ లాభం.. చివరకు గీ'థూ' అనిపించుకుంది.. ఇదే గుణపాఠం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook