Jathi Ratnalu movie, Sreekaram movie, Gali Sampath movie collections: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదలైన జాతి రత్నాలు, శ్రీకారం, గాలి సంపత్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కొల్లగొడతాయని ఆయా చిత్రాల నిర్మాతలు భావించారు. మరి వాస్తవ పరిస్థితి ఎలా ఉంది ? ఏ సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు అనే విషయంలో బాక్సాఫీస్ వర్గాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jathi Ratnalu movie చిన్న సినిమా కావడం, స్టార్ క్యాస్టింగ్ పెద్దగా లేకపోవడంతో నిర్మాతలు తక్కువ సంఖ్యలో థియేటర్లలోనే సినిమాను విడుదల చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియెన్స్ మాత్రం జాతి రత్నాలు సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. దీంతో ఫస్ట్ డే టాక్ విన్న తర్వాత రెండో రోజే జాతి రత్నాలు సినిమా కోసం ఇంకొన్ని థియేటర్స్ యాడ్ అయ్యాయి. 


జాతి రత్నాలు సినిమా తొలి నాలుగు రోజుల్లోనే రూ. 20 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అదే కానీ నిజమైతే ఇటీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చి అంత భారీ వసూళ్లు రాబట్టిన సినిమాగా Jathi Ratnalu movie collections పరంగా సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నట్టే. 


Also read : Jathi Ratnalu Trailer: కడుపుబ్బా నవ్విస్తున్న జాతి రత్నాలు ట్రైలర్


శర్వానంద్ హీరోగా వచ్చిన Sreekaram movie పై విడుదలకు ముందే భారీ అంచనాలే ఉన్నాయి. రైతులు - వ్యవసాయం అంశాలకు ముడిపెడుతూ మంచి సందేశంతో సినిమాను తెరకెక్కించినప్పటికీ.. కథనం సరిగ్గా లేకపోవడం వల్లే శ్రీకారం మూవీ ఆడియెన్స్‌ని అంతగా ఎట్రాక్ట్ చేయలేకపోయిందనే పబ్లిక్ టాక్. శ్రీకారం మూవీ విడుదలైన రోజు వసూళ్లు భారీగానే రాబట్టినప్పటికీ... రెండో రోజు నుంచే Sreekaram movie collections డ్రాప్ అవడం మొదలుపెట్టాయి.  శ్రీకారం కలెక్షన్స్ ఇలాగే తగ్గుముఖం పడితే, ఈ సినిమా Sharwanand movies లో మరో ప్లాప్ సినిమాగా మిగిలిపోతుందని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. సీడెడ్‌లో మాత్రం సినిమాకు మంచి స్పందనే కనిపిస్తోంది.


Also read : Wild Dog Trailer: వైల్డ్ డాగ్ ట్రైలర్ వచ్చేసిందోచ్


శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన Gali Sampath movie కూడా  జాతి రత్నాలు, శ్రీకారం సినిమాలతోపాటే విడుదలైంది. అయితే, విడుదలైన తొలి రోజే గాలి సంపత్ మూవీకి ఎదురుగాలి వీచింది. భారీ ప్రమోషన్స్ మధ్యే సినిమా విడుదలైనప్పటికీ... ఆడియెన్స్‌ని మెప్పించడంలో సక్సెస్ కాలేకపోయింది. Gali Sampath, Sreekaram collections డ్రాప్ అవడంతో ఇక మరో బ్లాక్ బస్టర్ సినిమా వచ్చే వరకు Jathi Ratnalu movie కి తిరుగులేదనే టాక్ వినిపిస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook