MAA Elections 2021: మా ఎన్నికలపై జూనియర్ ఎన్టీఆర్ అసహనానికి కారణమేంటి
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సమీపించే కొద్దీ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. రెండు ప్యానెల్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రమౌతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మా ఎన్నికలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సమీపించే కొద్దీ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. రెండు ప్యానెల్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రమౌతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మా ఎన్నికలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
మా ఎన్నికలకు(MAA Elections 2021)మరో ఐదు రోజులు మాత్రమే మిగిలింది. ప్రకాశ్‌రాజ్ వర్సెస్ మంచు విష్ణు ప్యానెల్ యుద్ధం ముదురుతోంది. రెండు ప్యానెల్ సభ్యుల మధ్య మాటల దాడి అధికమౌతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా మా ఎన్నికల ప్రస్తావనే ఉంటోంది. మంచు విష్ణు(Manchu Vishnu) ఇప్పటికే టాలీవుడ్ పెద్దల్ని కలుస్తూ..గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ, కృష్ణంరాజులను కలిసి మద్దతు కోరాడు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రకాశ్‌రాజ్ తనదైన శైలిలో గట్టిగానే విమర్శలు చేశాడు. తనకెవరి మద్దతు అవసరం లేదని చెప్పాడు. మెగా కుటుంబం మద్దతు దృష్టిలో పెట్టుకుని మరెవరీ మద్దతూ అవసరం లేదని చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) మా ఎన్నికలపై తీవ్ర వ్యాఖ్యలే చేసినట్టు తెలుస్తోంది. అది కూడా ప్రకాశ్‌రాజ్(Prakash raj pannel) ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవిత రాజశేఖర్ ..జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించి కీలకమైన, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలపై జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయాన్ని జీవిత రాజశేఖర్ వెల్లడించింది. ఇటీవల ఓ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశానని..మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న సంగతి చెబుతూ..ఓటు కోసం అభ్యర్ధించానని తెలిపారు. అయితే..మా ఎన్నికల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై జూనియర్ ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టుగా జీవిత రాజశేఖర్(Jeevitha Rajasekhar) చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని..ఓటు వేయనంటూ తేల్చి చెప్పేశారని జీవిత స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా నిజంగానే పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు.
Also read: NO Confidence Motion: కాకినాడలో గెలిచిన అవిశ్వాసం, ఓడిన మేయర్, డిప్యూటీ మేయర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook