బాహుబలి స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా అంటే ఆ సినిమాపై ప్రభాస్ అభిమానులకు ఎంత భారీ అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటిది ఆ సినిమాలో విలన్ పాత్రలో ప్రభాస్‌ని ఢీకొట్టాలంటే.. ఆ నటుడికి కూడా ఇంకెంత భారీ ఛరిష్మా, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి మరి. ఇంతకీ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సలార్ మూవీలో నటించనున్న ఆ విలన్ ఎవరు అనేదే కదా మీ సందేహం!! అక్కడికే వస్తున్నాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేజీఎఫ్-2 భారీ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను అనౌన్స్ చేసిన ప్రశాంత్ నీల్.. టైటిల్‌తోనే ప్రభాస్ ఫ్యాన్స్ దృష్టిని మాత్రమే కాకుండా మొత్తం మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించాడు. సలార్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ప్రభాస్ సరసన జంటగా నటించబోతున్నట్టు ఇప్పటికే ఓ ప్రచారం జరుగుతుండగా.. తాజాగా విలన్‌ పాత్ర పోషించబోయే నటుడి గురించి మరో టాక్ తెరపైకి వచ్చింది. 


Also read : Niharika Konidela: పెళ్లి తర్వాత నిహారిక కొత్త ప్రయత్నం


ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న సలార్ సినిమాలో బాలీవుడ్ నటి మాత్రమే కాదు... విలన్ కూడా బాలీవుడ్ హీరోనే ఉండనున్నాడట. లేటెస్ట్ ఫిలింనగర్ అప్‌డేట్స్ ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో, ఆరు అడుగుల ఆజానుబాహుడు జాన్ అబ్రహం విలన్ పాత్రలో ప్రభాస్‌ని ( Prabhas ) ఢీ కొట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం జాన్ అబ్రహం  ( John Abraham ).. షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా తెరకెక్కుతున్న పఠాన్ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. కేజీఎఫ్ 2 మూవీని ( KGF 2 movie ) నిర్మించిన హోంబేల్ చిత్ర నిర్మాణ సంస్థే ఈ సలార్ మూవీని సైతం నిర్మించనుంది.


Also read : Monal Gajjar: మోనల్ గజ్జర్‌ పర్మినెంట్ షిఫ్టింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook