Maha samudram Release: టాలీవుడ్‌లో మరో ప్రేమ కధా చిత్రమే అయినా..ఎవ్వరూ కొలవనంత ప్రేమను పంచడానికి వస్తున్నామంటోంది మహా సముద్రం. సముద్రపు అలల్లా ..ప్రేమలో ముంచెత్తనున్నామంటున్నారు చిత్ర యూనిట్. సముద్రం ఎప్పుడొచ్చేది ఫిక్స్ అయిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


శర్వానంద్ ( Sharvanand ) , సిద్దార్ద్ ( Sidharth ) లీడ్‌రోల్‌లో నటిస్తున్న చిత్రం మహా సముద్రం ( Maha Samudram ). ఆర్ఎక్స్ 100 చిత్రం ( RX 100 Movie ) కమర్షియల్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా నేపధ్యంగా నిర్మిస్తున్న చిత్రం రిలీజ్ డేట్‌ను సినిమా యూనిట్ అభిమానులకు వెల్లడించింది. ఎగసిపడే కెరటాలతో..అంతులేని కొలవలేని ప్రేమను పరిచయం చేసేందుకు ఆగస్టు 19న ( Maha samudram movie release date ) వస్తున్నామంటోంది చిత్ర యూనిట్. ఈ ఏడాది ఆగస్టు 19న విడుదల కానున్న మహా సముద్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. 


టాలీవుడ్‌లో ( Tollywood ) చాలా రోజుల విరామం తరువాత  సిద్ధార్ద్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ చిత్మ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరీ ( Aditi rao hydari ), అనూ ఇమ్మాన్యుయేల్ ( Anu Emmannuel ) కథానాయికలుగా కన్పించనున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అటు శర్వానంద్, ఇటు సిద్ధార్ద్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. 


Also read: Acharya Teaser: Chiranjeevi సత్తా ఏంటో చూపించిన ఆచార్య టీజర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook