Devara NTR Glimpse: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా వస్తున్నా సినిమా దేవర. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్స్ పతాకంపై నిర్మాత కళ్యాణ్ రామ్  భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం రెండు పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసి సినిమా మోస్ట్ వైలెన్స్, మాస్ గా ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈరోజు ఫైనల్ గా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదల చేశారు ఈ సినిమా మేకర్స్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈరోజు సాయంత్రం విడుదల చేసిన ఈ చిన్న వీడియోలో 'దేవర' ప్రపంచం ఎలా ఉండబోతుందనేది చూపించారు. అలానే అనిరుధ్ మార్క్ బీజీఎం ఈ గ్లిమ్స్ కి హైలెట్గా నిలిచింది. అదిరిపోయే విజువల్స్‌కి అనిరుధ్ ఇచ్చిన ఇంగ్లీష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరికొత్తగా అనిపించింది. 


సముద్రంపై ఓడల్లో వచ్చే కొందరు నౌకను ఎక్కి దోపిడీ చేసే షాట్‍తో ఈ గ్రింప్స్ మొదలైంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ తో ఊచకోత మొదలైంది. కత్తులతో.. ఎన్టీఆర్ విలన్స్ ని తెగనరికే సీక్వెన్స్ ఈ వీడియోలో హైలైట్ గా నిలిచింది. ఈ సముద్రం చేపల కంటే కత్తులను, నెత్తురు ఎక్కువగా చూసి ఉండాది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు” అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‍తో ఈ గ్లింప్స్ ముగిసింది. 


వెన్నులో వణుకు పుట్టించేలా, ఆద్యంతం మతిపోయేలా ఈ గ్లింప్స్ ఉండటం విశేషం. తారక్‌ ఫ్యాన్స్ కి ఈ వీడియో చూసే మరోసారి కొరటాల జూనియర్ ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు అనే విషయం అర్థమైపోతోంది. కొరటాల టేకింగ్‌, ఎన్టీఆర్‌ యాక్షన్‌ సీన్లు, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్‌ డెలివరీ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.


 



కాగా పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రూపొందుతోంది.దేవర గ్లింప్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ అయింది. దేవర పార్ట్-1 సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. పార్ట్ 2 విడుదల తేది గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, నరైన్, కలైరాసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ ఈ మూవీలో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. 


Also read: Sankranthi Holidays 2024: సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం, ఎప్పట్నించి ఎప్పటి వరకంటే


Also read: Aadhaar Update: ఆధార్‌లో అడ్రస్, పుట్టినతేదీ మార్చేందుకు ఏమేం అవసరం, ఎలా చేయాలి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook