Kesineni Nani: టీడీపీకు రాజీనామా చేయనున్న కేశినేని నాని, వైసీపీలో చేరనున్నారా

Kesineni Nani: ఏపీలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వాతావరణనం వేడెక్కుతోంది. రోజురోజుకూ సమీకరణాలు మారుతున్నాయి. అటు అధికార పార్టీకు ఇటు ప్రతిపక్షం తెలుగుదేశంకు ఊహించని పరిణామాలు ఎదురౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 6, 2024, 12:02 PM IST
Kesineni Nani: టీడీపీకు రాజీనామా చేయనున్న కేశినేని నాని, వైసీపీలో చేరనున్నారా

Kesineni Nani: ఏపీ సమీకరణాలు అంతకంతకూ మారుతున్నాయి. ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉండే విజయవాడ రాజకీయాల్లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలుగుదేశం పార్టీకు ఊహించని షాక్ ఎదురుకానుంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేశినాని పార్టీకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. 

తెలుగుదేశం పార్టీకు షాక్ తగులుతోంది. విజయవాడలో పార్టీకు పెద్దదిక్కుగా ఉన్న ఎంపీ కేశినేని నాని మొత్తానికి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. గత కొద్దికాలంగా చంద్రబాబుతోనూ, పార్టీలోని కొందరు నేతలతోనూ సఖ్యత కొనసాగడం లేదు. తెలుగుదేశం పార్టీ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నిపై మొగ్గుచూపుతోంది. అదే సమయంలో సోదరులిద్దరికీ సరిపడటం లేదు. పార్టీ కూడా చిన్నికే మద్దతుగా ఉండటంతో నాని అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. పార్టీని వీడుతున్నానని నేరుగా ప్రకటించేశారు. ఎక్స్‌లో ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు గారు పార్టీకు నా అవసరం లేదని భావించాక కూడా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన. అందుకే త్వరలో ఢిల్లీ వెళ్లి స్పీకర్‌ను కలిసి లోక్‌సభ సభ్యత్వానికి, రాజీనామా చేసి మరుక్షణం పార్టీకు రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు. 

మరిప్పుడు కేశినాని నాని రాజకీయ భవితవ్యమేంటనేదే అసలు ప్రశ్న. కేశినేని నానికి తెలుగుదేశం పార్టీ పరంగా కంటే వ్యక్తిగతంగా పట్టుంది. ఎందుకంటే 2014లో గెలవడమే కాకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీస్తున్న సమయంలో కూడా విజయవాడ గడ్డపై తన పట్టు నిరూపించుకుని రెండోసారి విజయం సాధించారు. అందుకే ఈసారి ఇండిపెండెంట్‌గా పోటి చేయవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. వైసీపీలో ఇప్పటికే ఆయనకు సన్నిహితులున్నారు. వైసీపీ కూడా కేశినేని నాని వస్తే నిరాకరించే పరిస్థితి లేదు. అన్నీ సవ్యంగా సాగితే వైసీపీలో చేరే అవకాశాలు లేకపోలేదు. 

Also read: Ambati Rayudu: వైసీపీకి బిగ్ షాక్... మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News