నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: బాబాయ్ సినిమాకు ముఖ్య అతిథిగా అబ్బాయ్!
నందమూరి ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త. బాబాయ్ బాలయ్య `అఖండ` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అబ్బాయ్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం.
Akhanda movie: నందమూరి అభిమానులకు శుభవార్త. ఎందుకంటే నందమూరి హీరోలిద్దరూ ఒకే వేదికపై మెరవనున్నారు. నటసింహం బాలకృష్ణ(balakrishna) కొత్త సినిమా 'అఖండ'(akhanda movie). డిసెంబరు 2న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో...నవంబరు 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్(akhanda pre release event) నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే హీరోలు ఎన్టీఆర్(jr ntr ), నాని(Hero Nani)లను ఈవెంట్‌కు ఆహ్వానించారట. అందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
గతంలో 'అరవింద సమేత' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య(balayya), కల్యాణ్‌రామ్ హాజరయ్యారు. అప్పుడు అబ్బాయి కోసం బాబాయ్ వస్తే.. ఇప్పుడు బాబాయ్ కోసం అబ్బాయ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.'అఖండ'లో(balakrishna akhanda movie) బాలయ్య రెండు పాత్రల్లో నటించారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్గా చేసింది.
Also Read: బాలకృష్ణ. మహేశ్‌బాబులతో కొరటాల మల్టీస్టారర్ మూవీ?
ఈ చిత్రంలో శ్రీకాంత్(Srikanth), జగతిబాబులు కీలకపాత్రలు పోషించారు. తమన్(thaman) సంగీతమందించగా, బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి.. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు.మరోవైపు ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో(RRR Movie) జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాని 'శ్యామ్‌సింగరాయ్' చిత్రం(shyam singha roy) డిసెంబరు 24న థియేటర్లలో సందడి చేయనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook