Devara Bookings: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా పై భారీ అంచనాల ఉన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారానే $ 2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు 6 యేళ్లు తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో ‘దేవర’ మూవీపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా సంచలన రికార్డులను నమోదు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఎన్టీఆర్ సినిమాలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఓపెనింగ్స్ వచ్చినా.. లాంగ్ రన్ ఉండదనే టాక్ ఉంది. ఇక్కడ చాలా మంది హీరోలు లాంగ్ రన్ లో రూ. కోటి గ్రాస్ అందుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం అందుకోలేదు. ‘ఆర్ఆర్ఆర్’ మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ రూపేణా రూ. 75 లక్షల గ్రాస్ అందుకోగా.. రెండు రోజు రూ. కోటి గ్రాస్ వసూళ్లను అందుకుంది.


తాజాగా ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలతో పాటు ఒక రోజు టికెట్ పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో ఒకప్పడు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో రూ. కోటి గ్రాస్ వసూళ్లను అందుకోవడంతో వెనకబడ్డాడని పేరు పడ్డ ఎన్టీఆర్.. తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టం మాములు విషయం కాదంటున్నారు. రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ అన్ని సినిమాలకు పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. తాజాగా ‘దేవర’కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఓ రేంజ్ లో వసూళ్లను రాబట్టడం ఖాయం అని చెప్పాలి. అంతేకాదు దసరా సెలవులను ఫుల్ గా క్యాష్ చేసుకోనే అవకాశం ఉందనే ముచ్చట వినబడుతుంది.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.