Devara Movie Latest Updates: రాజమౌళి దర్శకత్వంలో  ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. ఈ సినిమా సక్సెస్ లో ఎన్టీఆర్ పాత్రతో పాటు.. రామ్ చరణ్ క్యారెక్టర్.. రాజమౌళి టేకింగ్.. వంటివి కలిసొచ్చి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అంతేకాదు మన దేశం తరుపున ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చి చేరింది. ఈ సినిమా క్రెడిట్ ముగ్గురికి దక్కుతోంది.  ఈ సినిమా తర్వాత సోలో హీరోగా కొరటాల శివ ధర్శకత్వంలో ‘దేవర’ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా పవన్ కళ్యాణ్ ‘ఓజీ ’ మూవీ లేట్ కావడంతో ఆ డేట్ లో రెండు వారాలుగా ముందుగానే సెప్టెంబర్ 27న  సోలో రిలీజ్ కు రెడీ అయింది దేవర్ పార్ట్ -1.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా విడుదలకు మరో మూడు నెలలు టైమ్ ఉన్నా.. ఇప్పటికే అన్ని ఏరియాలకు సంబంధించి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అవుతూ వస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో ఈ సినిమా రూ. 16 కోట్ల నుంచి రూ. 18 కోట్ల మధ్య ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరోవైపు ఆరేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా రాయలసీమ (సీడెడ్)లో రూ. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తాజాగా రాయలసీమలో ‘దేవర్ పార్ట్ -1’ రూ. 23 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఆచార్య వంటి డిజాస్టర్ మూవీ తర్వాత కొరటాల శివ.. ఎన్టీఆర్ చేస్తోన్న ఈ సినిమాపై అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ చేస్తోంది.  మొత్తంగా రాయలసీమలో ఏ హీరోకు రానటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ ‘దేవర’ అమ్ముడుపోవడం మాములు విషయం కాదంటున్నారు. తాజాగా ‘కల్కి’ మూవీ కూడా రూ. 20 కోట్ల వరకే రాయలసీమలో బిజినెస్ చేసినట్టు సమాచారం. ఏది ఏమైనా సీడెడ్ ేరియాలో ఎన్టీఆర్ మించి తోపు  హీరో ఎవరు లేరంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారనేది చూడాలి.


ఇక హిందీలో ఈ సినిమా దాదాపు రూ. 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.


Read more: Chandrababu naidu: ఐదేళ్లుగా శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింట్లో కాలు పెట్టిన మహిళ.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook