Devara Release Trailer Review: ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ వచ్చేసింది. అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న రోజుకి తెరదించుతూ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను  పలు భాషలలో విడుదల చేశారు. అలా విడుదల అయిందో లేదో అప్పుడే 3 లక్షలకు కు పైగా వ్యూస్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది ఈ ట్రైలర్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. నిన్న రాత్రి ఒక పీడకల వచ్చింది జోగులా.. సంద్రం మళ్లీ ఎరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు .. అది నా చేతులు మీదుగా అయినట్టు కనిపించింది అంటూ ఎన్టీఆర్ వాయిస్ తో ఉలిక్కిపడి నిద్ర నుంచి లేచిన ఎన్టీఆర్ ను  మనకు చూపించారు. భయం పోవాలంటే దేవుడి కథ వినాలి.. భయం అంటే ఏంటో తెలియాలి అంటే దేవర కథ వినాలి అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ అక్కడ సన్నివేశాలకు హైలెట్గా నిలిచింది. 


సముద్రం మధ్యలో వేట కొడవళ్లతో చిత్రీకరించిన సన్నివేశాలు గూస్  బంప్స్ తెప్పిస్తున్నాయి.. హై యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా చాలా అద్భుతంగా చిత్రీకరించారని  చెప్పవచ్చు. ముఖ్యంగా సముద్రంలో జరిగే యాక్షన్స్ సన్నివేశాల కోసమే అయినా సరే ఈ సినిమా చూడాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.  ఎన్టీఆర్ మళ్ళీ తన హై మాస్ ఎనర్జిటిక్ యాక్షన్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు అంటూ మరొకసారి కామెంట్లు చేస్తున్నారు. 


ముఖ్యంగా ఇందులో శ్రీకాంత్ చెప్పే డైలాగులు కూడా హైలెట్గా నిలవనున్నాయి. ఇప్పటివరకు విలన్ గా అఖండ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. ఇప్పుడు మరొకసారి పాజిటివ్ క్యారెక్టర్ లో ఆడియన్స్ ని అలరించబోతున్నారు. ఇకపోతే యాక్షన్స్ సన్నివేశాలలో ఎన్టీఆర్ జీవించేశారు. 


ట్రైలర్ చూసిన అభిమానులు ఎన్టీఆర్ కు  ఈ సినిమాతో మరొకసారి బ్లాక్ బస్టర్ లభిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి కొంతమంది రాజమౌళి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇక సెప్టెంబర్ 27వ తేదీన ఊచకోతే జై ఎన్టీఆర్ అంటూ ఇలా అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఎన్టీఆర్ దేవర ట్రైలర్ పై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొత్తానికైతే ట్రైలర్ తోనే సినిమాపై భారీ హైప్ పెంచేశారు కొరటాల శివ. 


దేవర సినిమా విషయానికి వస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా,  కొరటాల శివ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా  రాబోతున్న చిత్రం ఇది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.


Also read: Bengaluru Horror: బెంగళూరులో హర్రర్, 25 ఏళ్ల యువతి ముక్కలు ముక్కలుగా ఫ్రిజ్‌లో , అసలేం జరిగింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.