Devara Trailer Date: జనతా గ్యారేజ్ సినిమా తరువాత మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమా దేవర. జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా కావటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా.. సినీ ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి తెప్పిస్తోంది. తాజాగా వినాయక చవితి ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల కానందో తెలియచేశారు చిత్ర యూనిట్. 


ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం.. ఈ నెల 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని పాన్ ఇండియా భాషలలో విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో నేడు వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా.. దేవ‌ర ట్రైల‌ర్‌ను ఈ నెల.. అనగా సెప్టెంబర్ 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించారు. అలాగే అంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలుపుతూ చిత్ర హీరో తార‌క్ ట్వీట్ చేశారు. 


 



'మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ వ‌స్తుంది' అని సినిమా నిర్మాణ సంస్థతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ విరుదల తారీకు ప్రకతిస్తూ.. చిత్ర యూనిట్ చేసిన పోస్టర్ సైతం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్.. నల్ల పంచ..షర్ట్ వేసుకొని ఎంతో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.


కాగా ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నారని.. తండ్రి, కొడుకుల ఇద్దరి పాత్రలో కనిపించనున్నారు అని వినికిడి స
దేవ‌ర‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీక‌పూర్ క‌థానాయిక‌గా నటిస్తుండగా.. మరోపక్క బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు. త‌మిళ యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన దేవ‌ర‌ సాంగ్స్‌, గ్లింప్స్‌తో మూవీపై  అంచ‌నాలు మ‌రింత పెంచాయి.


Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!


Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.