Jr NTR: తిరుపతి ప్రాంతానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గతంలో కౌశిక్ ఆరోగ్య పరిస్థితి.. గురించి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్, వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. తన చికిత్సకు అవసరమైన సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అయితే కౌశిక్ తల్లి సరస్వతమ్మ.. తాజా వ్యాఖ్యలతో ఈ విషయం మళ్లీ చర్చనీయాంశమైంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో కాల్‌లో కౌశిక్‌కు ధైర్యం చెప్పిన ఎన్టీఆర్, అప్పట్లో త్వరగా కోలుకుని దేవర సినిమా కలిసి చూడాలని కోరారు. అంటే కాదు తాను ఆర్థిక సాయం చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని సరస్వతమ్మ తెలిపారు.  


ఈ క్రమంలో కౌశిక్ కి ఉత్పత్తికి..ఏపీ ప్రభుత్వం రూ.11 లక్షలు, టీటీడీ రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించాయి. వీటికి సరస్వతమ్మ కృతజ్ఞతలు తెలిపారు. కౌశిక్ అభిమానులు రూ.2.5 లక్షల సాయం అందించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.  


ఇక చెన్నై అపోలో ఆస్పత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తి అయినప్పటికీ, ఇంకా రూ.20 లక్షల ఆస్పత్రి ఖర్చులు చెల్లించాల్సి ఉందని సరస్వతమ్మ పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వాగ్దానం ప్రకారం సాయం అందించాలని ఆమె కోరారు. ‌ఎన్టీఆర్‌కు దగ్గరగా ఉన్న వ్యక్తులను సంప్రదించినప్పటికీ ఎటువంటి సానుకూల స్పందన లభించలేదని.. సరస్వతమ్మ తెలిపారు. చివరిగా, తన కొడుకు ఆరోగ్యంపై దయ చూపి, చికిత్స పూర్తిచేసేందుకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.  


కౌశిక్ తన చివరి కోరికగా దేవర సినిమా చూడాలని కోరారు. ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించినప్పటికీ, ఆర్థిక సాయం విషయంలో మాత్రం ఆయన స్పందించలేదని.. ఇక ఇప్పటికైనా ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ముందడుగు వేయాలని కౌశిక్ తల్లి కోరారు.


Also Read: YS Jagan Sharmila: బర్త్ డేకు విష్ చేయని షర్మిల! వైఎస్‌ జగనన్న అంటే అంత కోపమా?


Also Read: YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్‌ షర్మిల ప్రశ్నలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook