NTR Hrithik War 2 Movie Latest Updates: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ 'వార్ 2'. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా దక్షిణాది, ఉత్తరాది సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ కలయికలో వస్తోన్న చిత్రం 'వార్ 2'. ఈ సినిమాలో షూటింగ్‌లో హృతిక్ రోషన్‌ పై షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. జపాన్‌ దేశంలో హృతిక్ పై దర్శకుడు అయాన్ ముఖర్జీ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మరోవైపు ఎన్టీఆర్.. ఈ సినిమా షూటింగ్‌లో ఈ వీకెండ్‌లో జాయిన్ కానున్నాడు. ఈసినిమాలో తారక్‌తో పాటు మరో తెలుగు నటుడు జగపతి బాబు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో జగ్గూ భాయ్ కనిపించనున్నట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pregnant Woman Tips: సమ్మర్ లో గర్భిణీలు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి..


ఇప్పటికే 'వార్ 2' మూవీ కోసం రామోజీ ఫిల్మ్స్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌ వేసారు. అక్కడ అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నాడు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. దాదాపు రెండు నెలల డేట్స్ కేటాయించినట్టు సమాచారం. అందులో ఓ నెల రోజుల పాటు ఎన్టీఆర్, హృతిక్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు తరహాలో ఇందులో ఎన్టీఆర్, హృతిక్‌లపై ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేసారట. ఈ సినిమాకు ఈ పాట హైలెట్‌గా నిలిచే అవకాశాలున్నాయి. తారక్, హృతిక్ లపై వచ్చే సీన్స్ ఆడియన్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయనేది టాక్. ఈ చిత్రంలో హృతిక్ షూటింగ్ పార్ట్ జూన్ చివరి వరకు కంప్లీట్ కానుంది. మరోవైపు తారక్ షూటింగ్ పార్ట్ జూలై వరకు కంప్లీట్ కానుంది. 


ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చిత్రం చేస్తున్నాడు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను అక్టోబర్ 10న దసరా  కానుకగా విడుదల చేయనున్నారు. మరోవైపు తారక్.. ప్రశాంత్ నీల్ మూవీని ఈ యేడాది చివర్లో స్టార్ట్ చేయనున్నారు. మొత్తంగా తారక్.. ఎలాంటి ఈగోలకు పోకుండా ఇతర స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో పాటు మరో హిందీలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ భాగం కాబోతున్నట్టు సమాచారం. మరోవైపు అట్లీతో ఓ సినిమా ఉండనే ఉంది. దాంతో పాటు  కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్‌లతో కూడా తారక్  చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. త్వరలో వీళ్లిద్దరితో చేయబోయే సినిమాలను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. అటు హృతికో రోషన్ విషయానికొస్తే.. రీసెంట్‌గా 'ఫైటర్' మూవీతో పలకరించారు.


Also Read: Bus Yatra: చంద్రబాబు జిత్తులమారి.. పొత్తులమారి: బస్సు యాత్రలో జగన్‌ ధ్వజం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి