Jr Ntr about RRR movie, SS Rajamouli: కరోనా బారిన పడిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా నుంచి కోలుకుంటున్నాడు. కరోనా సోకడంతో పాటు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాబోయే చిత్రాల గురించి పలు ఆసక్తికరమైన అంశాలు అభిమానులతో పంచుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అంతకంటే ముందే ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ఆర్ఆర్ మూవీ పూర్తయితే ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రం కానున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మించనుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రజెంట్ చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఆర్ఆర్ఆర్ మూవీ తరహాలోనే అన్ని భాషల్లో విడుదల కానుంది. 


NTR 30 తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నాడు. ఎన్‌టిఆర్31 ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. కేజీఎఫ్ మూవీతో యశ్‌కి ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న సినిమా కావడంతో NTR31 పై తారక్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 


ఫైనల్‌గా ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) గురించి ఏమైనా ఆసక్తికరమైన అంశాలు చెప్పాల్సిందిగా కోరగా... తాను ఆర్ఆర్ఆర్ మూవీ విశేషాల గురించి చెబితే, రాజమౌళి ఈ ఇంటర్వ్యూ (Jr NTR) చదివిన తర్వాత నాకోసం గొడ్డలి పట్టుకుని పరిగెత్తుకొస్తాడు అంటూ చమత్కరించి మొత్తానికి ఏమీ చెప్పకుండానే తెలివిగా తప్పించుకున్నాడు. 


ఆర్ఆర్ఆర్ మూవీలో తారక్ కొమురం భీమ్ పాత్రలో (Jr Ntr Komuram Bheem) కనిపించనుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో (Ram Charan as Alluri Seetharama Raju) ఆకట్టుకోనున్నాడు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుకు సతీమణి పాత్రలో నటిస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఉండే భారీ అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.