Jr NTR May be possible contender for Oscars: దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొమరం భీమ్ అనే పాత్రలో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు అనే పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటించిన ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్లు సాధించి తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఇక ఈ సినిమాలో ఒకపక్క రామ్ చరణ్ మరోపక్క ఎన్టీఆర్ పోటాపోటీగా నటించారని తెలుగు ప్రేక్షకులు అందరూ భావిస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా రామ్ చరణ్ పాత్రకు నటించే అవకాశం ఎక్కువ దక్కిందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ నటనకు ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందంటూ ఆంగ్ల పత్రిక ఒకటి ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. నిజానికి ఆస్కార్ బరిలో ఎన్టీఆర్ దిగలేదు కానీ ఆస్కార్ బరిలో దిగే అవకాశం ఉందంటూ ముందే ఊహించే వెరైటీ అనే ఒక మ్యాగజైన్ వారు ఒక జాబితాను విడుదల చేశారు.  


అందులో 2023 సంవత్సరానికి గాను బెస్ట్ యాక్టర్ అనే విభాగంలో ఏషియా నుంచి ఎన్టీఆర్ పేరు ఎంపిక చేసే అవకాశం ఉందని భావిస్తూ ఆయన పేరుని ప్రెడిక్ట్ చేసింది. అయితే అఫీషియల్ కాకపోయినా ఆ స్థాయిలో గుర్తింపు దక్కడం అయినా మామూలు విషయం కాదంటూ ఆయన అభిమానులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏడాది వారి ఊహాగానం కచ్చితంగా నిజమయ్యే అవకాశం ఉందని కూడా ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.


ఇక ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో నిలుస్తారా? లేదా? అనే విషయం పక్కన పెడితే ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం ఆస్కార్ బరిలో అవకాశం ఉందనే వార్త సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇక డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఎప్పటిలాగే రాజమౌళి కుటుంబం అంతా ఈ సినిమా కోసం కష్టపడి పని చేశారు. ఈ సినిమా కేవలం ఐదు భారతీయ భాషల్లోనే కాక మరిన్ని విదేశీ భాషల్లో కూడా డబ్బింగ్ అవుతూ రిలీజ్ అవుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది.


Also Read: Ritika Singh: అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచిన రితిక.. క్లీవేజ్ షో చూశారా?


Also Read: Surekha Vani: సురేఖా వాణి రెండో పెళ్లి, బాయ్ ఫ్రెండ్ కూడా… అలా లీక్ చేసిన కూతురు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి