Surekha Vani: సురేఖా వాణి రెండో పెళ్లి, బాయ్ ఫ్రెండ్ కూడా… అలా లీక్ చేసిన కూతురు!

Surekha Vani Second Marriage Confirmed By Supritha: సురేఖా వాణి రెండో పెళ్లికి సిద్దమైనట్టు ఆమె కుమార్తె సుప్రీత లీకులు ఇచ్చింది. ఆ కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2022, 06:03 PM IST
Surekha Vani: సురేఖా వాణి రెండో పెళ్లి, బాయ్ ఫ్రెండ్ కూడా… అలా లీక్ చేసిన కూతురు!

Surekha Vani Second Marriage Confirmed By Supritha: తెలుగులో ఎక్కువగా అమ్మ, వదిన పాత్రలు చేస్తూ హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సురేఖా వాణి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వయసు 50కి దగ్గర పడుతున్నా ఈ బ్యూటీ తన కుమార్తెతో సమానంగా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. పొట్టి బట్టలు ధరిస్తూ మోడ్రన్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.

నిజానికి ఆమె భర్త చనిపోయాక చాన్నాళ్లపాటు బయటకు రాలేదని తానే ఆమెను దగ్గరుండి బయటకు తీసుకువచ్చి దానిని అని ఆమె కుమార్తె పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అయితే సోషల్ మీడియాలో సురేఖా వాణి మోడ్రన్ గా కనిపిస్తూ ఉండడంతో ఆమె మీద ట్రోల్స్ కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి.  సురేఖ ఆంటీ అంటూ సంబోధిస్తూ ఆమె మీద కామెంట్లు చేసే నెటిజన్లు కూడా ఎక్కువగానే ఉంటారు.

అయితే ఈ భామ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైందనే వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి ఆమెకు రెండో పెళ్లి జరుగుతుంది అంటూ అడపాదడపా వార్తలు వస్తూనే ఉంటాయి. ఆ విషయం మీద వారు కూడా సెటైరికల్ గా స్పందిస్తూనే ఉంటారు. కానీ తాజాగా వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో త్వరలో సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా అని ప్రశ్నించగా అందుకు సురేఖా వాణి లేదని పేర్కొంటే సుప్రీత మాత్రం చేసుకుంటుందని పేర్కొంది.

అంతే కాక పెళ్లి చేసేద్దాం సింగిల్‌ గా ఎలా ఉంటుంది? అలా ఉన్నప్పటి నుంచి నా బుర్ర తింటూ ఉంటుంది అంటూ సుప్రీత కామెంట్‌ చేసింది. అంతేకాక మీరిద్దరూ ఇప్పుడు సింగిల్ గానే ఉన్నారా? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అని అడిగితే సింగిల్ గానే ఉన్నామని ఎవరూ లేరని సురేఖా వాణి, సుప్రీత చెప్పుకొచ్చింది. అయితే తనకు బాయ్ ఫ్రెండ్ ఉండాలంటే లక్షణాలు ఇవి అంటూ కొన్ని లక్షణాలు సురేఖా వాణి చెబుతూ ఉండగానే మరి అతనికి ఇవేమీ లేవు కదా అని సురేఖ వాణి అనడంతో ఆమె కూతురితో అలాంటివన్నీ ఇక్కడ మాట్లాడకూడదు అంటూ నోరు మూయించడం కనిపిస్తోంది. అంటే సురేఖ వాణి ఎవరితోనో డేటింగ్ చేస్తోంది అని ఆ విషయాన్ని ఆమె కుమార్తె చెప్పబోగా ఆమె నోరు మూయించిందని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి . మరి నిజంగానే సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి మరి. 

Also Read: Jalsa: థియేటర్లలో సందడి చేయనున్న జల్సా.. 4K క్వాలిటీతో సంజయ్ సాహో రీఎంట్రీ!

Also Read: Trivikram: ఆ సెంటిమెంట్ దెబ్బతో టెన్షన్లో మహేష్ ఫాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News