Tarakaratna Heart Attack తారకరత్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, వాహనం మీద నుంచి సొమ్మసిల్లి పడిపోయాడని నారా లోకేష్‌ యువగళం నుంచి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే తారకరత్నకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందట. వెంటనే వైద్యులు చికిత్స అందించారు. స్టంట్లు కూడా వేశారట. తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందనే వార్తలు బయటకు రావడంతో నందమూరి అభిమానులు ఆందోళన చెందారు. ఇక బాలయ్యకు ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్యం గురించి ఎన్టీఆర్ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తారకరత్నను బెంగళూర్‌కు తరలించబోతోన్నట్టుగా వైద్యులు ప్రకటించారు. అంబులెన్స్‌లో తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డాక్లర్ల సూచనతోనే బెంగళూర్‌కు తరలిస్తామని చెప్పుకొచ్చారు. ఆయన గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్‌ అయ్యిందని వైద్యులు ప్రకటించారు. మిగితా అన్నీ రిపోర్టులు బాగున్నాయని, చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని బాలయ్య అభిమానులకు విషయాన్ని చెప్పారు.  


యువగళం పాదయాత్రం ప్రారంభం తరువాత కొద్దిదూరం నడిచి మసీదులో లోకేశ్‌ ప్రార్థనలు చేశాడు. ఆ సమయంలో తారకరత్న పక్కనే ఉన్నాడట. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో… తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారని తెలుస్తోంది.


ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫోన్ చేశాడని, బాలయ్యను అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడని, అన్న ఆరోగ్యం పట్ల కంగారు పడ్డట్టుగా తెలుస్తోంది. మరి ఇంత వరకు ఎన్టీఆర్ అయితే సోషల్ మీడియా వేదికగా ఎటువంటి పోస్ట్ కూడా చేయలేదు. ఫోన్‌లోనే సంభాషించాడని, తారకరత్న గురించి ఆరా తీశాడనే వార్తలు మాత్రం వస్తున్నాయి.


Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 


Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి