RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ కొత్త డేట్ వచ్చేసింది..గురువారం కోసం వేచిచూద్దాం
RRR Trailer New Release Date : జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ వాయిదా పడింది. ఇప్పుడు కొత్త అప్‌డేట్ వచ్చింది.
Jr NTR, Ram Charans RRR Movie Trailer New Release date announced: జూనియర్ ఎన్టీఆర్, (Jr NTR) రామ్‌చరణ్ హీరోలుగా ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో (SS Rajamouli) తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. ఈ మూవీని దాదాపు రూ. 450 కోట్లపైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) ఈ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక తారక్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న (On January 7th) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) నుంచి రెండు పాటలు వచ్చాయి.
Also Read : IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియాకు 332 పరుగుల భారీ ఆధిక్యం!!
ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను (Movie Trailer) డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం వల్ల ట్రైలర్‌ని వాయిదా వేశారు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ (RRR Trailer) కు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ కొత్త డేట్ ను అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. డిసెంబర్ 9న (గురువారం)ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ విడుదల కానుంది.
Also Read : Omicron: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు-గుజరాత్‌లో గుర్తింపు-మూడుకి చేరిన కేసుల సంఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook