Devara Pre Release Event Cancelled: మొన్న అల్లు అర్జున్‌ను టార్గెట్ చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారా ? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ వ్యవహారంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కొందరు టార్గెట్ చేసి రచ్చ చేశారు. బన్నీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. తాజాగా ఎన్టీఆర్‌ను కొందరు కావాలనే టార్గెట్ చేశారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేవర మూవీ ప్రీ రిలీజ్ షోలోకి కొందరు చొరబడి రచ్చ చేయడం సంచలనంగా మారింది. దీంతో భద్రతా కారణాల రీత్యా ఈవెంట్‌ను రద్దు చేశారు. అయితే ఇదంతా పక్కా ప్లాన్‌తో చేశారంటున్నారు తారక్ అభిమానులు.  తమ హీరోను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొంతకాలంగా ఎన్టీఆర్‌కు దూరం పెరిగిందంటూ ప్రచారం జరుగుతోంది.


ఇటీవల చంద్రబాబును కలుస్తానని చెప్పిన ఎన్టీఆర్.. కలవలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొందరు ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసి ఉంటారని ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ ఈవెంట్ లో శ్రేయాస్ మీడియా అత్యుత్యాహం ప్రదర్శించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కెపాసిటీకి మించి పాస్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వేలాది మందిగా ఒక్కసారిగా ఆడిటోరియంలోకి దూసుకురావడంతో పోలీసులు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అదుపు చేయలేకపోయారు. అంతేకాదు ఇందులో కొంత మంది అసాంఘిక శక్తులు ప్రవేశించి నోవాటెల్ హోటల్ అద్దాలు ధ్వంసం చేసారు. ఈ క్రమంలో కొంత మంది అభిమానులు గాయల పాలయ్యారు. దీంతో పోలీసులు పరిస్థితిన అదుపులోకి తీసుకురావడానికి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు కెపాసిటీకి మించి పాస్ లు ఇష్యూ చేసిన శ్రేయాస్ మీడియాపై కేసు నమోదు చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.


అయితే ఈవెంట్ రద్దు పై ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుక రద్దు కావడంతో మీకంటే నాకే ఎక్కువగా బాధగా ఉంది. థియేటర్స్ లో కలుద్దాం అంటూ కాస్తంత ఎమోషనల్ అయ్యారు. మరోవైపు దేవర టీమ్ మాత్రం నగరంలో రీసెంట్ గా గణేష్ నిమజ్జన జరిగింది. పోలీసులు బుధ, గురవారాల వరకు ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఈ ఈవెంట్ ఏర్పాటు చేయడానికి తగిన సమయం లేకపోవడం. అభిమానులు అంచనాలకు మించి రావడం .. పైగా నగరంలో మళ్లీ వర్ష బీభత్సం వంటి కారణాల వల్ల ఈ ఈవెంట్ ను రద్దు చేసినట్టు దేవర టీమ్ ప్రెస్ నోట్ విడుదల  చేసింది. రెండు రాష్ట్రాలు, దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు క్షమాపణలు కోరారు. మరి ఏది ఏమైనా దేవర టీమ్ మాత్రం సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ వేడుక క్యాన్సిల్ అయినట్టు చెబుతున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో వాళ్లకే తెలియాలి.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.