Jr NTR to Assembly: సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి వెళ్లనున్న జూనియర్ ఎన్టీఆర్
Jr NTR to Attend Karnataka Assembly: జూనియర్ ఎన్ఠీఆర్ కు ఏకంగా సీఎం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందడం చర్చనీయాంశం అవుతోంది, ఆ వివరాల్లోకి వెళితే
Jr NTR to Attend Karnataka Assembly: జూనియర్ ఎన్టీఆర్ కు ఏకంగా ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వెళ్లబోతున్నారని టాపిక్ వినిపిస్తోంది. అదేమిటి ఎన్టీఆర్ తెలంగాణ అసెంబ్లీకి వెళ్ళబోతున్నారా? లేక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్లబోతున్నారా? ఆయన తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉంటారు కదా ఆయనని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఎవరు పిలిచి ఉంటారు అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారా? అయితే ఆగండి ఆయన వెళ్ళేది మన అసెంబ్లీకి కాదు కర్ణాటక అసెంబ్లీకి.
తన నటనతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాక పాన్ ఇండియా లెవెల్ లో అందరినీ ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి కన్నడ రాష్ట్రంలో ప్రత్యేక క్రేజ్ ఉంది. ఆయన తల్లి కన్నడ రాష్ట్రానికి చెందిన కుందాపుర అనే గ్రామంలో జన్మించడంతో ఆయనకు కూడా కన్నడ వచ్చు. అంతేకాక ఆయన సినిమాలు కూడా కన్నడ నాట గట్టిగానే ఆడుతూ ఉంటాయి. తాజాగా ఆయనకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆహ్వానాన్ని పంపింది. తమ అసెంబ్లీలో జరగబోయే కార్యక్రమానికి హాజరు కావాలని కోరింది.
తాజాగా ఎన్టీఆర్ కర్ణాటక విధాన సౌధలో జరగబోయే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ఏడాది 1 న జరగబోయే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి తారక్ వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక అత్యున్నత పురస్కారం 'కర్ణాటక రత్న' అవార్డు ప్రదానం చేయనుంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు పునీత్ రాజ్ కుమార్ కి మంచి స్నేహం ఉందనే విషయం కూడా అనేక సందర్భాల్లో వెల్లడవుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన కర్ణాటక అసెంబ్లీకి హాజరు కాబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ కార్యక్రమానికి రావడానికి తారక్ సుముఖత వ్యక్తం చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెల్లడించారు, ఇక ఇదే కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ని సైతం ఆహ్వానించామని అన్నారు. కన్నడ ప్రజల్లో పునీత్‌కు ఉన్న గౌరవానికి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నామని పేర్కొన్న ఆయన ఈ కార్యక్రమానికి పునీత్ రాజ్ కుమార్ కుటుంబంతో పాటు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్ను కూడా కన్నడ సర్కార్ ఆహ్వానించిందని చెబుతున్నారు, ఇక వీరితో పాటుగా కన్నడ సాహిత్య పరిషత్ కు చెందిన కవులు, కళాకారులు, రచయితలు కూడా హాజరు కానున్నారు. పునీత్ రాజ్‌కుమార్ గత ఏడాది అక్టోబర్ 23న కన్నుమూయగా ఆయన పేరిట ఈ అవార్డు ప్రకటించారు, ఈ అవార్డు అందుకున్న 9వ వ్యక్తిగా పునీత్ నిలవనున్నారు.
Also Read: Kantara OTT Date: 'కాంతార'కు పెద్ద షాక్.. అప్పుడే ఓటీటీలో రిలీజ్.. మామూలు దెబ్బ కాదుగా!
Also Read: Amy Jackson Bikini Stills : అమీ.. ఏమీ అందమిది.. బికినీలో రామ్ చరణ్ హీరోయిన్ సందడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook